‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల తర్వాత రవితేజ హీరో గా నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ‘రావణాసుర’ సినిమాకి క్రిటిక్స్ నుండి మంచి రేటింగ్స్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది, ఇక ఆ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. ఇలా రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడం తో తీవ్రమైన నిరుత్సాహం లో ఉన్న రవితేజ ఫ్యాన్స్ కి రీసెంట్ గా విడుదలైన ‘ఈగల్’ చిత్రం సక్సెస్ మంచి జోష్ ని ఇచ్చింది అనే చెప్పాలి.
ఇది రెగ్యులర్ రవితేజ సినిమా కాదు. కాస్త రొటీన్ కి భిన్నంగా, మంచి ఎలివేషన్ సన్నివేశాలతో తెరకెక్కించాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. కానీ టాక్ విషయం లో మాత్రం ఈ సినిమాకి కూడా డివైడ్ గానే వచ్చింది. దాదాపుగా థియేట్రికల్ రన్ ని ముగించుకున్న ఈ చిత్రం, ఫుల్ రన్ లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
ఇకపోతే ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరిగింది. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకి ఫుల్ రన్ లో దాదాపుగా 21 కోట్ల రూపాయిలు వచ్చాయట. అంతే కాదు ఓవర్సీస్ లో ఈ సినిమాకి దాదాపుగా 7 లక్షల డాలర్లు వచ్చాయట. ఇది రవితేజ కెరీర్ లో రాజా ది గ్రేట్ చిత్రం తర్వాత హైయెస్ట్ వసూళ్లు అని చెప్పొచ్చు.
మొత్తం మీద ఓవరాల్ గా ఈ సినిమాకి లాభాలు రాలేదు, అలా అని నష్టాలు కూడా రాలేదు. పర్వాలేదు అనే రేంజ్ ఫలితం వచ్చింది. టాక్ లేకుండా ఈ రేంజ్ వసూళ్లు అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ చిత్రం తర్వాత రవితేజ హరీష్ శంకర్ తో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో రవితేజ కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ కొడతాడని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్.