Sreeleela : ఈమధ్య కాలంలో సెలెబ్రిటీలు ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నారో, అంతే తొందరగా విడిపోతున్నారు కూడా. ఎవరో ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి ఇలాగే ఉంది. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న సంఘటన అందరికీ ఎంత పెద్ద షాక్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీళ్ళను మేడ్ ఫర్ ఈచ్ అథర్, జంట అంటే ఇలా ఉండాలి అని అనుకున్న అభిమానులు మొత్తం ఫూల్స్ అయ్యారు.
ఒకే ఇండస్ట్రీ నుండి పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎక్కువ కాలం కలిసి ఉండరు అనేది అనేక సందర్భాల్లో రుజువు అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ప్రముఖ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి రీసెంట్ గానే టాలీవుడ్ క్రేజీ హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
అయితే ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ కూడా టాలీవుడ్ కి సంబంధించిన ఒక స్టార్ హీరో హీరో కుటుంబం లోకి అడుగుపెట్టబోతుందట. ఆమె మరెవరో కాదు, శ్రీలీల. ఈమధ్యనే ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ, అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఈమె చేసిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి కానీ, ఆమెకి అవకాశాలు రావడం లో మాత్రం ఎలాంటి లోటు లేదు.
అయితే రీసెంట్ గానే ఈమె తల్లి శ్రీలీల కి జాతకం చెప్పించింది అట. ఈ జాతకం ప్రకారం చూస్తే శ్రీలీల టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కుటుంబం లోకి కోడలిగా అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది అని చెప్పారట. దీంతో సోషల్ మీడియా లో నెటిజెన్స్,’భగవంత్ కేసరి’ సినిమా షూటింగ్ సమయం లో నందమూరి మోక్షజ్ఞ తో శ్రీలీల బాగా క్లోజ్ గా ఉండడం అందరూ చూసారు. కాబట్టి కచ్చితంగా మోక్షజ్ఞ నే పెళ్లాడబోతుంది అని సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.