Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవికి యాక్షన్ సినిమాలే కాదు కుటుంబ కథా కథనాలు కూడా ఉన్నాయి. అలాంటిదే డాడీ మూవీ. ఇందులో ఒక ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తాడు మెగాస్టార్. ఈ సినిమాలో చిరంజీవి, సిమ్రాన్, అషిమా భల్లా హీరో హీరోయిన్లు. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎస్ఏ రాజ్‌కుమార్ పాడిన ఈ సినిమా పాటలను అభిమానులు ఇప్పటికీ హమ్ చేస్తూనే ఉన్నారు.
గీతా ఆర్ట్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2001లో విడుదలైన ఈ సినిమా 97 కేంద్రాల్లో 50 రోజులు, 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లో డబ్ చేసి విడుదల చేశారు.

అయితే ఈ సినిమాలో మెగాస్టార్ మేనల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సంగతి చాలా మందికి తెలిసిందే. ఇందులో చిరంజీవి శిష్యుడిగా కనిపిస్తాడు. బన్నీ తన ట్రూప్‌లో డ్యాన్సర్. ఇందులో బన్నీ, చిరంజీవి మధ్య కొన్ని సన్నివేశాలు కూడా ఉంటాయి నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి. అయితే ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఈ ఐకాన్ స్టార్. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఇది ఎవరికీ తెలియదు.
ఒక సన్నివేశంలో కనిపిస్తాడు. పొరపాటున జరిగిందా.. షూటింగ్ చూసేందుకు వచ్చిన పవన్ ఇలా కెమెరాకు చిక్కాడో తెలియదు కానీ.. అతనే పవన్ అని గుర్తిచలేము. ఒక్క సీన్ లో అలా వచ్చి మెరిసిపోయాడు. కానీ మనకు అంతలా కనిపించడు కానీ.. ఈ సినిమాలో అసలు పవన్ ఉన్నట్లు చిరంజీవికి కూడా తెలుసో లేదో.. ఎందుకంటే ఇప్పటి వరకు డాడీ మూవీలో పవన్ అలా ఒకసెకెన్ కనిపిస్తాడు అనే మాట ఎప్పుడు మెసాస్టార్ కూడా ప్రస్తావించకపోవడం విశేషం.

ఇంతకీ ఆసీన్ ఏంటంటే.. ఇందులో చిరంజీవి రెండో పాప ఓ పని కోసం నిధులు సేకరిస్తోంది. అప్పుడు ఓ గ్యాంగ్ ఓ పబ్‌కి వస్తుంది. అప్పుడు విలన్ గ్యాంగ్ డబ్బు తీసుకుని ఆ పాపను ఏడిపిస్తారు. ఆ సీన్లో ఫైట్ ఉంటుంది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. గ్యాంగ్ పబ్‌లోకి ప్రవేశిస్తుండగా ఓ అబ్బాయి.. భయంతో లేస్తారు. ఆ యువకుడే పవన్.
అయితే ఆ సీన్ లో పవన్ గుండుతో కనిపిస్తాడు. అతను తెల్లటి టీ షర్టు, నీలిరంగు జీన్స్ ధరించి ఉంటాడు. ఒక్క సెకను.. అలా వచ్చి ఇలా వెళ్లిపోతాడు. ఆసీన్ జస్ట్ అలా సాగిపోతుంది. చాలా గమనిస్తే తప్పా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని తెలియదు. ఆ సీన్ పొరపాటుగా జరిగిందా.. లేక టీమ్ గుర్తించలేదో తెలియదు కానీ పవన్ మాత్రం ఆసీన్ లో జస్ట్ కనిపిస్తాడు అంతే..