Manchu Vishnu అన్ని కోట్లు పెట్టి తీస్తున్నావ్.. ప్రభాస్ సరసన పార్వతిగా మంచి హీరోయినే దొరకలేదా ?

- Advertisement -


Manchu Vishnu : మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మంచు విష్ణు. మోహన్ బాబుకు ఇండస్ట్రీలో ఉన్నంత గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు ఆయన సంతానం. వారిలో మంచు విష్ణు అరకొర మంచి సినిమాలు చేసినా కెరీర్ కు సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. దీంతో ప్రొడ్యూసర్ గా.. లీడ్ రోల్ లో నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఒక కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందే.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడు గా కనిపించబోతున్నాడంటూ వార్తలు వైర‌ల్ అవుతుంది. దీనిపై మేకర్స్ కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే ప్రభాస్ శివుడు కాగా పార్వతి పాత్ర ఎవరు చేస్తున్నారన్న ఆసక్తి ఇటు ఆయన అభిమానుల్లో అటు ప్రేక్షకుల్లో మొదలైంది. మొదట్లో కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడిగా చేస్తుండగా.. పార్వతి దేవి పాత్రలో ఆయన సరసన నయనతార నటిస్తుందంటూ వార్తలు గుప్పుమన్నాయి.

కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్రకు నయనతారను కాకుండా బాలీవుడ్‌కు చెందిన ఈ కాంట్రవర్సియల్ బ్యూటీని ఎంపిక చేశారట మేకర్స్. ఇంతకీ ఆమె ఎవరో ఒకసారి చూద్దాం. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కంగనా రనౌత్. సినిమాల్లో కంటే కాంట్రవర్షియల్ కంటెంట్ తో ఎక్కువగా పాపులరైంది కంగనా. తెలుగులో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాలో మాత్రమే నటించింది. ఆ సినిమా తర్వాత మరోసారి ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ తో టాలీవుడ్ మూవీలో నటించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా.. కంగనా రనౌత్ పార్వతిగా కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇక ఈ సినిమాను మంచు విష్ణు బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఏడాది దసరాకు రిలీజ్ చేసేలా మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కాగా ప్రస్తుతం ప్రభాస్, కంగనా జంటగా నటిస్తున్నారని వార్తలు వైరల్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. పోయి పోయి ప్రభాస్ పక్కన ఆ హీరోయిన్ ను ఎంచుకున్నావేంటి విష్ణు. అంతకంటే మంచి హీరోయిన్ నీకు దొరకలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here