Jaya Jaya Nayaka : అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌బాబు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. అల్లుడు శ్రీను సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన శ్రీనివాస్ మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా ద్వారా నటుడిగా కూడా బెల్లంకొండకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత స్పీడున్నోడు లాంటి డిఫరెంట్ సినిమాతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర తొలి ఫ్లాప్‌ని మూటగట్టుకున్నాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా బోయపాటితో జయ జానకి నాయక ఆఫర్ వచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ సెన్సేషనల్ ఓపెనింగ్ సాధించింది. కానీ అది కూడా బ్రేక్ ఈవెన్ లేకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది.
కానీ మాస్ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. బోయపాటి మాస్ యాక్షన్ ప్రేక్షకులను ఎలా మెప్పించిందో రిపీటెడ్ షోలు చూస్తే అర్థమవుతుంది. తెలుగు సంగతి ఇలా ఉంటే నార్త్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. దీనికి యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా 2017 లో రిలీజ్ అయింది. అలాగే సినిమా టెలివిజన్ లో కూడా మంచి రేటింగ్ అందుకొని తెలుగు ప్రేక్షకుల అభిమాన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఈ సినిమాను యూట్యూబ్‌లో ఏకంగా 800 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
బెల్లంకొండ శ్రీనివాస్ కి నార్త్ లో మంచి క్రేజ్ ఉంది. అతని చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. సీత, కవచం, సాక్ష్యం, స్పీడున్నోడు వంటి సినిమాలకు కోటిన్నర వ్యూస్ వచ్చాయి. ఇక శ్రీనివాస్ ఇప్పుడు హిందీలో ఛత్రపతి రీమేక్‌తో అరంగేట్రం చేశాడు. కానీ ఆ సినిమా అసలు వచ్చిందా అన్నట్లు అట్టర్ ఫ్లాప్ అయింది. ఈరోజుల్లో థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు సరైన హిట్ టాక్ ను అందుకోకపోయినా.. ఆ సినిమాలు అన్ని ఓటీటీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి.. ఇక్కడ సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.