Bigg Boss : ఈమధ్య కాలం లో బుల్లితెర మీద ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ లో ముద్దులు హగ్గులు వంటివి బాగా ఎక్కువ అయిపోయాయి. కుటుంబం చూసే కార్యక్రమాలు అని కూడా లేకుండా హద్దులు దాటేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ షోస్ అంటే సాంగ్స్ ఉంటాయి, సందర్భాలు కలిసి వస్తాయి కాబట్టి అలాంటి రొమాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. కానీ టాక్ షోస్ లో కూడా ఈమధ్య రొమాన్స్ ఎక్కువ అయిపోయింది.
పలు సీరియల్స్ ద్వారా అడపాదడపా ఫేమ్ ని సంపాదించి, ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మంచి ఇమేజి ని సంపాదించుకున్న వారిలో ఒకరు వాసంతి కృష్ణన్. ఈమె అందంకి , చిలిపితనం కి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. నిన్న ఈమె పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. గత కొంతకాలం నుండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపి డేటింగ్ చేసిన వాసంతి కృష్ణన్, ఎట్టకేలకు అతనిని పెళ్లాడింది.
ఇదంతా పక్కన పెడితే పెళ్ళికి ముందే వీళ్లిద్దరు కలిసి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే టాక్ షో కి హాజరయ్యారు. అక్కడ యాంకర్ కోరినట్టుగా ఇద్దరు ముద్దులు పెట్టుకోవడం, హగ్గులు చేసుకోవడం వంటివి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం గా మారింది. నేషనల్ మీడియా కి సంబంధించిన కొన్ని పేజీలు కూడా ఈ వీడియో ని షేర్ చేస్తూ ఇది టాలీవుడ్ అంటే అంటూ పరువు తీస్తున్నారు. దీనిపై నెటిజెన్స్ కూడా మండిపడుతున్నారు.
పెళ్లి అయ్యే వరకు అంతలా ఆగలేకపోతే వేరే ఎక్కడైనా కానివ్వండి, ఇలాంటి చోట్ల ఏమిటి మీ సరసాలు?, తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే వాసంతి కృష్ణన్, పవన్ కళ్యాణ్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. వాసంతి కి బాగా ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్, తన భర్త పేరు కూడా పవన్ కళ్యాణ్ అవ్వడం విశేషం.