Bigg Boss Sohel : టీవీ సీరియల్స్ మరియు గేమ్ షోస్ లో కనిపించే కొంతమంది సెలెబ్రిటీలు బిగ్ బాస్ రియాలిటీ షో లో అవకాశం సంపాదించి, మంచి క్రేజ్ రాగానే సినిమాల్లో పెద్ద హీరో అయిపోదామని కలలు కంటూ ఉంటారు. టాలెంట్ ఉన్నవారు ఆ మాత్రం కలలు కనడం లో ఎలాంటి తప్పు లేదు. కానీ సరైన స్క్రిప్ట్ సెలక్షన్, అదృష్టం అన్నీ కలిసి రావాలి, అప్పుడే సక్సెస్ అవ్వగలరు.
అదృష్టం చాలా తక్కువ మందికి మాత్రమే దక్కుతుంది. తక్కువ సక్సెస్ శాతం ఉంది కాబట్టి, దొరికిన దానితోనే సంతృప్తి పడాలి. ఆకాశానికి నిచ్చెన వేసి, వచ్చే అవకాశాలను వదులుకుంటే కెరీర్ సర్వనాశనం అవుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ సోహైల్ పరిస్థితి కూడా అదే. బిగ్ బాస్ సీజన్ 4 లో ఈయన టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు. అంతకు ముందు పలు సీరియల్స్ లో హీరో గా నటించాడు కానీ, గుర్తింపు మాత్రం బిగ్ బాస్ షో ద్వారానే దక్కింది.
బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో హీరో అయిపోదామని ఇండస్ట్రీ కి వచ్చాడు. ఇప్పటికి నాలుగు సినిమాల్లో హీరో గా నటించాడు కానీ, ఒక్కటి కూడా సక్సెస్ సాదించలేకపోయింది. నాల్గవ సినిమాగా విడుదలైన ‘బూట్ కట్ బాలరాజు’ కి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. సంపాదించిన డబ్బులతో పాటు, తన తండ్రి రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులను కూడా పెట్టి ఈ సినిమాని తీసాడు. సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
నా సినిమాని చూడండి భయ్యా అంటూ మీడియా ముందు సోహైల్ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ వీడియో లు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా ఇప్పుడు మార్చి 1 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఎలాగో థియేటర్ లో నా సినిమాని చూడలేదు, కనీసం ఓటీటీ లో అయినా చూడండి భయ్యా అంటూ సోహైల్ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.