Pooja Hegde : జిమ్ వర్కౌట్స్ చేసి ఇంటికి వెళ్తున్న పూజా హెగ్డే పై దాడి.. ఎలా తప్పించుకుందో మీరే చూడండి!

- Advertisement -

Pooja Hegde : టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో పూజ హెగ్డే కచ్చితంగా ఉంటుంది. ఈమె కెరీర్ చాలా వెరైటీ గా సాగింది. అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన ‘ఒక లైలా కోసం’ అనే చిత్రం ద్వారా ఈమె ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా హిట్టైన తర్వాత వరుణ్ తేజ్ తో ముకుంద అనే చిత్రం చేసింది.

Pooja Hegde
Pooja Hegde

ఈ సినిమా తర్వాత ఆమెకి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ రావడం తో అక్కడికి వెళ్ళిపోయింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో పూజ హెగ్డే కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ‘దువ్వాడ జగన్నాథం’ అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Pooja Hegde MOvies

కానీ రీసెంట్ గా వరుస ఫ్లాప్స్ రావడం తో ఈమె సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఎప్పుడు మళ్ళీ ఆమె రీ ఎంట్రీ ఇస్తుందో తెలియదు కానీ, సోషల్ మీడియా ని మాత్రం ఒక రేంజ్ లో దున్నేస్తుంది. ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఆమె రెగ్యులర్ గా తనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పెడుతూ ఉంటుంది. షూటింగ్ లేని సమయం లో ఎక్కువగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ చమట్లు చిందిస్తూ ఉండే ఈమె, రీసెంట్ గానే ఒక వీడియో అప్లోడ్ చేసింది.

- Advertisement -
Pooja Hegde Workout

జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కొన్ని ఫైట్ షాట్స్ చేసింది. దీనిని చూసిన అభిమానులు, పూజ హెగ్డే లో ఈ యాంగిల్ కూడా దాగి ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. కండలు తిరిగిన మగవాళ్ళను విసిరి కొట్టేస్తుంది. చూస్తూ ఉంటే త్వరలోనే ఆమె ఒక యాక్షన్ సినిమాలో నటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు అభిమానులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here