Oye Re-Release : ఒకప్పుడు మన టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో సిద్దార్థ్. ఈయనకి యూత్ లో, అమ్మాయిలలో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆయన చేసిన ప్రతీ సినిమా దేనికి దానికి స్పెషల్ గా ఉండేది. బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇలా ఒక్కటా రెండా ఎన్నో క్లాసిక్ చిత్రాలను తెలుగు ఆడియన్స్ కి అందించాడు.
ఆయన హీరో గా నటించిన ఓయ్ చిత్రం రీసెంట్ గానే రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సిద్దార్థ్ కి తెలుగు లో ఇంకా ఇంత క్రేజ్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఈ రీ రిలీజ్. తెలుగు సినిమాలకు ఆయన దూరం అయ్యాక, మార్కెట్ మొత్తం పోయింది. ఆయన కొత్త సినిమాలకు కనీస స్థాయి వసూళ్లు కూడా రావడం లేదు.
అలాంటి సమయం లో ఆయన పాత చిత్రం ‘ఓయ్’ రీ రిలీజ్ అయ్యి ఈ రేంజ్ సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రీ రిలీజ్ కి ఫుల్ రన్ లో దాదాపుగా 2 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది రీసెంట్ గా తెలుగు లో విడుదలైన సిద్దార్థ్ కొత్త సినిమాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని అంటున్నారు.
అంతే కాదు, ఈ సినిమా రీసెంట్ గా విడుదలైన ఎన్నో కొత్త సినిమాలను కూడా డామినేట్ చేసి సత్తా చాటింది. దీంతో ఇప్పుడు సిద్దార్థ్ పాత సినిమాలకు బాగా డిమాండ్ పెరిగింది. కేవలం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల రీ రిలీజ్‌లకు ఉండే డిమాండ్ ఇప్పుడు సిద్దార్థ్ సినిమాలకు కూడా ఉండడం విశేషం.