Brama Yugam : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘భ్రమయుగం’. ఆగస్టు 17, 2023న షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఫిబ్రవరి 15న ఆడియన్స్ ముందుకి వచ్చింది. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాని రాహుల్ సదాశివన్ తెరకెక్కించాడు. అగ్రెసివ్ గా ప్రమోషన్స్ జరుపుకోని థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకి కేరళలో మొదటి రోజు మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ వచ్చింది. కొత్త కథ, అంతే కొంత న్యారేషణ్ తో భ్రమ యుగం సినిమా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎపిసోడ్స్ థ్రిల్ చేస్తుండడంతో ఆడియన్స్ సినిమాని చూడడానికి మరింత ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మమ్ముట్టి నుంచి ఒక కొత్త సినిమా వచ్చింది అనే కాంప్లిమెంట్స్ క్రిటిక్స్ నుంచి కూడా వస్తుండడం విశేషం.
హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాలో మమ్ముట్టి… కేవలం సింగల్ కాస్ట్యుమ్ కనిపించడం విశేషం. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఇలా ఒకటే కాస్ట్యుమ్ కనిపించడం గొప్ప విషయం అనే చెప్పాలి. ఎక్కువ పాత్రలు లేకుండా ఎక్స్ట్రా కమర్షియల్ ఎలిమెంట్స్ వైపు వెళ్లకుండా భ్రమయుగం సినిమాని రియలిస్టిక్ గా తెరకెక్కించిన విధానంపై ఆడియన్స్ నుంచి ప్రశంశలు అందుతున్నాయి. “కేవలం మూడు పాత్రలతో రెండున్నర గంటల పాటు ఈ సినిమాను నడిపించారు. అందులోనూ ఈ కాలంలో బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో సినిమా తీసి పెద్ద సాహసం చేశారు మమ్ముట్టి. ఇక స్టార్ హీరో హోదాను పక్కన పెట్టి ఇలాంటి పాత్రను మమ్ముట్టి చేయడం చూసి ఆడియన్స్ కూడా అవాక్కయ్యారు. సినిమా మొత్తం ఒక్కటే కాస్ట్యూమ్‌లో కనిపించారు మమ్ముట్టి. కానీ వీటన్నింటినీ తన నటన, స్టోరీతో కనిపించకుండా చేశారు మమ్ముకా” అంటూ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి.