War 2 : షూటింగ్ స్పాట్ లో హృతిక్ రోషన్ కి తీవ్ర గాయాలు..ఇక ఇప్పట్లో ‘వార్ 2’ లేనట్టే!

- Advertisement -

War 2 : బాలీవుడ్ లో యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు హృతిక్ రోషన్. ఈయనకి బాలీవుడ్ లో మాత్రమే కాదు, తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన హీరో గా నటించిన క్రిష్, క్రిష్ 2 , ధూమ్ 2 మరియు వార్ వంటి సినిమాలు తెలుగు లో కూడా బాగా ఆడాయి.

ప్రస్తుతం ఇప్పుడు ఆయన ‘వార్ 2’ లో హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బ్రహ్మాస్త్ర’ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ షూటింగ్ సమయం లో హృతిక్ రోషన్ కి గాయాలయ్యాయి, ఆ కాళ్ళు బాగా దెబ్బతినడం తో స్ట్రెచెస్ సహాయం తో నడుస్తున్నాడు. రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటో ని షేర్ చేస్తూ ‘మీలో ఎంతమందికి క్రచెస్, వీల్ చైర్ అవసరమైంది’ అని అడుగుతాడు. హృతిక్ రోషన్ ని ఆ స్థితి లో చూసిన అభిమానులు చలించిపోయారు. మా అభిమాన హీరోకి ఏమైంది అంటూ కామెంట్స్ చేసారు.

- Advertisement -

హృతిక్ రోషన్ షేర్ చేసిన ఆ ఫోటో పై టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, వాణికపూర్ వంటి సెలబ్రిటీస్ కూడా స్పందించారు. తొందరగా కోలుకోవాలి అంటూ ప్రార్థనలు చేసారు. దీంతో ‘వార్ 2 ‘ మూవీ షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. అతి త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా సెట్స్ లో పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న ఈ నేపథ్యం లో హృతిక్ రోషన్ కి ఇలా అవ్వడం బాధాకరం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here