Jabardasth Comedian ప్రేమికుల రోజే ప్రియుడికి గుడ్ బై చెప్పిన జబర్దస్త్ కమెడియన్

- Advertisement -


Jabardasth Comedian ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. సామాన్య కుటుంబం నుంచి వచ్చి కూడా ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ అందుకున్నారు. పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ వచ్చిన వారి టాలెంట్ గుర్తించి జబర్దస్త్ ఒక జీవితాన్ని ఇచ్చింది. ఇలా వచ్చినవారిలో లేడీ కమెడియన్ పవిత్ర ఒకరు. ఈ మధ్య జబర్డస్త్ లో లేడి టీమ్ ఒకటి సందడి చేస్తున్న విషయం తెల్సిందే. రోహిణి టీమ్ లీడర్ గా చేస్తున్న ఈ టీమ్ లో పవిత్ర కంటెస్టెంట్ గా చేస్తోంది. జబర్దస్త్ కు వచ్చిన దగ్గరనుంచి ఆమె తన ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు అందుకుంది. ప్రస్తుతం ఈవెంట్స్, షోస్ అంటూ ఖాళీ లేకుండా తిరుగుతున్న పవిత్ర.. ప్రేమికుల రోజున అభిమానులకు మింగుడు పడని బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆమె, తన ప్రియుడికి బ్రేకప్ చెప్పినట్లు అధికారికంగా ప్రకటించింది. గతేడాది పవిత్ర.. ఒక స్టేజీమీద తన ప్రియుడు సంతోష్ ను ఇంట్రడ్యూస్ చేసింది. తన జీవితంలోకి సంతోష్ వచ్చాక లైఫ్ మారిపోయిందని కన్నీటి పర్వంతం అవుతూ చెప్పుకొచ్చింది.

2002 లో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్రపోజ్ చేస్తే.. ఆమె ఓకే చెప్పింది. ఇక ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఆమె తామిద్దరం విడిపోయామని చెప్పి తన అభిమానులకు షాక్ ఇచ్చింది. ‘మా శ్రేయోభిలాషులందరికీ, పరస్పర అవగాహన ద్వారా, సంతోష్, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా మార్గాలు వేరుగా ఉన్నా.. మేము పంచుకున్న క్షణాలు, ఒకరినొకరు గౌరవించుకున్నందుకు మేము కృతజ్ఞులంగా ఉన్నాం. మా వ్యక్తిగత ప్రయాణాలలో మా ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మాకు మద్దతు ఇవ్వాలని, మాకు గోప్యత ఇవ్వాలని మేము మా శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాము, మేము ముందుకు సాగాలి. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here