Rajinikanth సౌత్ ఇండియా లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడే హీరోలలో ఒకడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆఫ్ కెమెరా లో రజినీకాంత్ ని చూస్తే అసలు ఈయన పెద్ద సూపర్ స్టార్ అంటే ఎవ్వరూ నమ్మరు అనే విధంగా ఉంటాడు. అందరితో పాటు నెల మీద కూర్చుంటాడు, అందరితో కలిసి తింటాడు, ఆయన సింప్లిసిటీ ని చూసి ఆదర్శంగా తీసుకున్న సూపర్ స్టార్స్ ఎందరో ఉన్నారు.

అలాంటి రజినీకాంత్ తన బయోపిక్ ‘ది నేమ్ ఈజ్ రజినీకాంత్’ లో తన జీవితం లో జరిగిన ఒక ముఖ్య సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. 2007 వ సంవత్సరం లో సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘శివాజీ’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

కేవలం తెలుగు, తమిళం లో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా ఈ చిత్రం అప్పట్లో ఒక ప్రభంజనం. ఈ సినిమా విడుదల తర్వాత రజినీకాంత్ ఒక ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నాడట. అయితే రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ ఆలయం లోకి ప్రవేశిస్తే భక్తులు కచ్చితంగా ఎగబడతారు. తొక్కిసిలాటలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే రజినీకాంత్ ఒక పాత ముడతలు ఉన్నా చొక్కా, సాధారణ లుంగీని ధరించి, మందపాటి గోధుమ రంగు శాలువాతో తలపై కప్పుకుని దేవుడి దర్శనానికి వెళ్లాడట.

ఆయన ఆలయానికి వచ్చిన రోజే అప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఒక కొత్త హీరోయిన్ కూడా ఆలయానికి వచ్చిందట. మారు వేషం లో, వృద్దుడిగా రజినీకాంత్ కుంటుకుంటూ లోపలకి వెళ్లడం ని చూసి చాలా భాదపడిందట. ఆ తర్వాత వెంటనే పది రూపాయిలను తీసి భిక్షం గా వేసిందట. రజినీకాంత్ ఆ బిక్షం ని తీసుకొని లోపలకి వెళ్ళాడట. దర్శనం చేసుకొని బయటకి వచ్చి, దేవుడి హుండీలో వంద రూపాయిల నోటు కట్టని వేసి, ఆ తర్వాత కారులో వెళ్లడం ని గమనించిన ఆ హీరోయిన్ అది ఎవరో కాదు రజినీకాంత్ అనే విషయం తెలుసుకొని చాలా భాదపడిందట.
