Hi Nanna గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన న్యాచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ చిత్రం సైలెంట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. కేవలం మూడు కోట్ల రూపాయిల ఓపెనింగ్ ని తెచ్చుకున్న ఈ సినిమా దాదాపుగా 40 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది అంటే లాంగ్ రన్ ఎంత గొప్పగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. నాని ఇమేజి ని ఫ్యామిలీ ఆడియన్స్ లో మరింత పెంచేలా చేసింది ఈ చిత్రం.

ఇక ఓటీటీ లో విడుదలైన తర్వాత కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసి తెలుగు తో పాటుగా హిందీ, తమిళం మరియు కన్నడ భాషల్లో కూడా దబ్ చేసి అప్లోడ్ చేసింది. రెస్పాన్స్ ఊహించిన దానికంటే సెన్సేషనల్ గా వచ్చింది.

విచిత్రం ఏమిటంటే ఈ సినిమా కంటే చాలా ఆలస్యం గా విడుదలైన ప్రభాస్ ‘సలార్’ చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ నుండి వెళ్ళిపోయింది. కానీ ‘హాయ్ నాన్న’ చిత్రం మాత్రం ఇంకా టాప్ 10 లో ట్రెండ్ అవుతూనే ఉంది. అంటే వారానికి మిలియన్ కి పైగా వ్యూస్ వస్తూనే ఉన్నాయి అన్నమాట. తెలుగు వెర్షన్ ట్రెండింగ్ నుండి బయటకి వెళ్ళిపోయింది కానీ, హిందీ వెర్షన్ మాత్రం ట్రెండింగ్ లోనే ఉంది.

అంతే కాదు #RRR చిత్రం తర్వాత అత్యధిక రోజులు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అయ్యే చిత్రం గా ‘హాయ్ నాన్న’ నిలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. రాబొయ్యే రోజుల్లో ఈ చిత్రం 50 మిలియన్ కి పైగా వ్యూస్ కౌంట్ ని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. చూడాలిమరి ఈ సినిమా ఇంకెన్ని మైల్ స్టోన్స్ ని దాటబోతుంది అనేది.
