Rakul Preet Singh టాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ స్టార్ హీరోయిన్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, చేసిన రెండు మూడు సినిమాలతోనే ఈమె స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. సౌత్ లో దాదాపుగా కుర్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరితో కలిసి నటించింది. అయితే ఎంత వేగంగా ఆమె స్టార్ హీరోయిన్ అయ్యిందో, అంతే వేగంగా క్రింద పడిపోయింది.

వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం, కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి దూసుకొని వచ్చి సక్సెస్ అవ్వడం తో రకుల్ ప్రీత్ సింగ్ వైపు చూడడం కూడా మానేశారు మన దర్శక నిర్మాతలు. దీంతో ఆమె తమిళం మరియు హిందీ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ వచ్చింది. అక్కడ కూడా ఆమెకి సక్సెస్లు కరువు అయ్యాయి. హిందీ లో సినిమాలతో పాటుగా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అవి కూడా అంతంత మాత్రంగానే రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.
ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం తో తన ప్రియుడు జాకీ భగ్నానీ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యింది. వీళ్లిద్దరు ఈ నెల 21 వ తారీఖున వివాహ బంధం ద్వారా ఒకటి కాబోతున్నారు. వీళ్ళ పెళ్ళి గోవాలో ఘనంగా జరగబోతుంది. ఈ పెళ్ళికి రకుల్ ప్రీత్ సింగ్ బంధు మిత్రులతో పాటుగా, ఇండస్ట్రీ కి సంబంధించిన పలువురు నటీనటులు కూడా హాజరు కాబోతున్నారు. ఇది ఇలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిన పెళ్లి శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

గోవా బీచ్ వద్ద ఫర్నీచర్ వేసుకొని కూర్చున్నట్టుగా ఈ వెడ్డింగ్ కార్డు ని డిజైన్ చేయించారు. ఒక్కో వెడ్డింగ్ కార్డుని తయారు చేయించడానికి దాదాపుగా ఆరు లక్షల రూపాయిలు ఖర్చు అయ్యిందట. పెళ్లి వెడ్డింగ్ కార్డుకి ఈ రేంజ్ ఖర్చులు టాప్ సెలబ్రిటీస్ పెట్టడం కొత్తేమి కాదు, దాదాపుగా అందరి పెళ్లిళ్లకు ఇదే రేంజ్ లో ఖర్చులు అయ్యాయి.