Hanuman movie : జనవరి 12 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘హనుమాన్’ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాధారణంగా ఈ చిన్న సినిమా గా విడుదలైంది కాబట్టి, ఈ చిత్రాన్ని పెద్ద సినిమాల నిర్మాతలు తొక్కేయడానికి చాలా ప్రయత్నాలే చేసారు. ఉదాహరణకి హైదరాబాద్ వంటి సిటీ లో హనుమాన్ కి కేవలం ఒకే ఒక్క సింగిల్ స్క్రీన్ దొరికింది.

కానీ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం తో రెండవ రోజు నుండి థియేటర్స్ పెరుగుతూ వచ్చింది. పబ్లిక్ నుండి డిమాండ్ విపరీతంగా రావడం తో షోస్ మరింత పెంచారు. అలా సాగిన హనుమాన్ బాక్స్ ఆఫీస్ జర్నీ 300 కోట్ల రూపాయిల గ్రాస్ మార్క్ ని దాటేసింది. షేర్ అయితే 160 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పటికే ఈ చిత్రం నాన్ రాజమౌళి, నాన్ ప్రభాస్ రికార్డ్స్ ని తప్ప స్టార్ హీరోలందరి కలెక్షన్స్ ని దాటేసింది.

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా 50 రోజుల కేంద్రాల లిస్ట్ లో కూడా రికార్డుని నెలకొల్పింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో ఎవ్వరూ కూడా సెంటర్స్ ని కొలమానం గా చూడడం లేదు. ఎందుకంటే ఈమధ్య సినిమాలు రెండు మూడు వారాలకు మించి థియేటర్స్ లో రన్ అవ్వడం కష్టం గా మారింది. ఇలాంటి సమయం లో హనుమాన్ చిత్రం ఏకంగా 300 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుండడం అందరినీ షాక్ కి గురి చేసింది.

ఓటీటీ లో ఇంకా రిలీజ్ కాకపోవడం తో ఈ సినిమాకి వీకెండ్స్ లో ఇంకా మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది కచ్చితంగా 300 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోవడం పక్కా అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక జరిగితే టాలీవుడ్ హిస్టరీ లోనే అన్ని సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా ‘హనుమాన్’ నిలుస్తుంది.
