Poonam Pandey : ప్రముఖ మోడల్, హీరోయిన్ పూనమ్ పాండే ఇటీవల కాలంలో హెడ్‌లైన్స్‌లో నిలిచిపోయింది. గర్భాశయ క్యాన్సర్‌తో మరణించినట్లు తప్పుడు ప్రచారం చేసి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని తరువాత కాన్పూర్, ముంబైతో సహా దేశవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆమె చేసిన ఈ నకిలీ పబ్లిక్ సిటీ స్టంట్ సమస్య కాబోతోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైజన్ అన్సారీ పూనమ్ పాండేపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫైజాన్ అన్సారీ కాన్పూర్ పోలీస్ కమిషనర్‌ను కలిసి పూనమ్ పాండేపై ఫిర్యాదు చేశారు. సీపీ విచారణను ఫైల్ఖానా ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. దీంతో పాటు ఫైజాన్ అన్సారీ కాన్పూర్ కోర్టులో దావా వేయనున్నారు.
మోడల్ పూనమ్ పాండే దేశం మొత్తాన్ని ఎగతాళి చేసిందని ఫైజాన్ అన్సారీ అంటున్నాడు. ఆమె మహిళలు, గర్భాశయ క్యాన్సర్ బాధితులను కూడా ఎగతాళి చేసిందని పేర్కొన్నాడు. నేను ఆమెపై ఈ పోరాటాన్ని ముంబై నుండి ప్రారంభించాను. నేను కాన్పూర్ పోలీస్ కమీషనర్‌ని కలిసి ఫిర్యాదు లేఖను సమర్పించాను. దీంతో పాటు పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల కేసు పెడుతున్నానని పేర్కొన్నాడు. తప్పుడు పబ్లిసిటీ స్టంట్ కోసం పూనమ్ పాండే ఇలాంటి పని చేస్తూనే ఉందని ఫైజాన్ అన్సారీ అన్నారు. గతంలో భారత్ ప్రపంచకప్ గెలిస్తే బట్టలు విప్పి మైదానంలోకి పరుగెత్తుతానని ప్రకటన ఇచ్చింది. పబ్లిసిటీ కోసం ఒకరి జీవితంతో ఆడుకోవడం లేదా ఒకరి భావాలతో ఆడుకోవడం తప్పు. ఈ విషయంలో చర్య తీసుకోవడానికి నేను కాన్పూర్ వచ్చానన్నాడు ఫైజాన్ అన్సారీ.
పూనమ్ పాండేపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు పెట్టబోతున్నాను. ఇందులో 7 నుంచి 8 ఏళ్ల జైలు శిక్ష కూడా ఉంది. పరువు నష్టం కేసు నుంచి పూనమ్ పాండే తప్పించుకోవాలనుకుంటే ఏదైనా పెద్ద క్యాన్సర్ ఆసుపత్రికి రెండు కోట్లు ఇవ్వండి. తద్వారా పేద క్యాన్సర్ బాధితులకు ఆ డబ్బుతో వైద్యం చేయవచ్చన్నారు. ఆ తర్వాత ఈ కేసును ఉపసంహరించుకుంటాను. ఆమెతో నాకు వ్యక్తిగత శత్రుత్వం లేదన్నాడు.