Vyooham వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు అన్ని అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండో సారి సెన్సార్ నిర్వహించారు. దీంతో సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలిగిపోయాయి. సినిమాను త్వరలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేవయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక దీంతో వ్యూహం సినిమా సెన్సార్‌ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దుచేసింది. దీంతో ఈ తీర్పును డివిజన్ బెంచ్‍లో సవాల్ చేయగా బెంచ్ విచారణ జరిపింది. ఈ చిత్రాన్ని మరోసారి సమీక్షించాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. మళ్లీ సినిమా వీక్షించిన సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేషన్ ఇవ్వడంతో వ్యూహం సినిమా రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ లభించింది. సినిమాను ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. తాజాగా చంద్రబాబుకు ఉన్న సినిమా రిలీజ్ డేట్ కు ఉన్న లింక్ ఇదే అంటూ ఆర్జీవీ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. చంద్రబాబు లక్కీ నంబర్ 23 అని ఆయన వివరించారు.
- వైసీపీ పార్టీ నుంచి బాబు గెలిచిన 23 ఎమ్మెల్యే సీట్లు.
- 2019 ఎన్నికల తర్వాత ఓడిపోయానని తెలుసుకున్న 23వ రోజు.
- బాబు గెలిచిన ఎమ్మెల్యే సీట్లు 23 మాత్రమే.
- బాబు అరెస్ట్ తేదీ 9 – 9 – 23.
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, బాబు ఫ్రీజ్ నంబర్ 7691 కేసులో సీబీఐ కోర్టు 2023 సెప్టెంబర్ 23 వరకు తీర్పును రిమాండ్ చేసింది.
- లోకేష్ పుట్టిన రోజు 23, కానీ చంద్రబాబు, ఎన్టీఆర్ లకు దూరమైనా ఆయనను పార్టీ వారసుడిని చేయాలనుకుంటున్నారు.
- వ్యూహం సినిమా జగ గర్జన ఈవెంట్ 23. వ్యూహం సినిమా రిలీజ్ 23 అంటూ వివరించాడు.