మద్యానికి బానిసై కెరీర్లు పోగొట్టుకొని, ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయిన లెజెండ్స్ చాలా మంది ఉన్నారు. దాని కనీసం పూట సినిమా అవకాశాలకు దూరమై పూట కూడా గడవని సందర్భాలు ఏర్పడి ఆకలితో చనిపోయిన నటులు కూడా ఉన్నారు. అయితే రీసెంట్ గా కోలీవుడ్ ఒక ప్రముఖ నటి, మద్యానికి బానిసైన తన కొడుకు చేతిలో హత్యకి గురి అయ్యింది.
ఇలాంటి సంఘటన మాత్రం ఇప్పటి వరకు ఏ ఇండస్ట్రీ లో కూడా జరగలేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కోలీవుడ్ లో సీనియర్ నటి గా కాళీ అమ్మాళ్ కి మంచి డిమాండ్ ఉండేది. 72 ఏళ్ళ వయస్సు ఉన్న ఈమె ఇది వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేసింది. ఈమెకి నమ్మకోడి అనే కొడుకు ఉన్నాడు. వీళ్లిద్దరు కలిసి గతం లో పలు తమిళ చానెల్స్ కి ఇంటర్వూస్ కూడా ఇచ్చి ఉన్నారు.
అయితే నమ్మకోడి అనే వ్యక్తి పచ్చి తాగుబోతు, మద్యానికి డబ్బు కోసం తన కుటుంబ సభ్యులను ఎప్పుడూ వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమం లో ఒక రోజు తన తల్లి కాళీ అమ్మాళ్ తో పెద్ద గొడవ అయ్యింది. డబ్బులు ఇవ్వమంటూ ఆమెతో ఒక రోజు పెద్ద ఎత్తున గొడవకి దిగాడు, కానీ ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, విచక్షణ కోల్పోయి కోపానికి గురైన నమ్మకోడి కన్న తల్లి అయిన కాళీ అమ్మాళ్ ని అతి దారుణంగా హత్య చేసాడు.
72 ఏళ్ళ వయస్సు ఉన్న ఒక పెద్ద ఆవిడ ని కన్న తల్లి అని కూడా చూడకుండా, ఆమెకి ఎంతో బాధని కలిగిస్తూ చంపేసిన ఈ క్రూరుడిని ఏమి చెయ్యాలో మీరే చెప్పండి. కాళీ అమ్మాళ్ చివరి సారిగా విజయ్ సేతుపతి హీరో గా నటించిన ‘చివరి వ్యవసాయదారుడు’ అనే చిత్రం లో నటించింది.