Priyamani : ఆ రెండు కోరికలు తీర్చేవాడి కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ప్రియమణి షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Priyamani : అందం తో కాకుండా అభినయం తో కూడా ఇండస్ట్రీ లో దశాబ్దాలు కొనసాగొచ్చు అని నిరూపించిన స్టార్ హీరోయిన్స్ లో ఒకరు ప్రియమణి. ‘ఎవరే అతగాడు’ అనే తెలుగు సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ప్రియమణి, ఆ తర్వాత తమిళం మరియు మలయాళం భాషల్లో ఎక్కువగా అవకాశాలను సంపాదించింది. ఆ తర్వాత తెలుగు లో మళ్ళీ జగపతి హీరో గా నటించిన ‘పెళ్ళైన కొత్తలో’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది అనే విషయం అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంది. తమిళ హీరో కార్తీ తో కలిసి తో కలిసి అప్పట్లో ఆమె ‘పరుతీవారెన్’ సినిమా లో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను ఆమెకి ఉత్తమ నటి క్యాటగిరీ లో నేషనల్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది.

అలా కెరీర్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన ప్రియమణి కి ఒక రెండు కోరికలు మాత్రం అలాగే ఉండిపోయాయట. ఆ కోరికలు నెరవేర్చేవాడి కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అందులో మొదటి కోరిక ఏమిటంటే ఆమెకి స్థాయి కామెడీ రోల్ చెయ్యాలని ఉందట. చాలా కాలం నుండి ఇలాంటి రోల్ కోసం ఎదురు చూసాను కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ ఆ రోల్ ని ఆఫర్ చెయ్యలేదు అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఇక ఆమె రెండవ కోరిక పవర్ ఫుల్ విలన్ గా చెయ్యాలని. ఇది వరకు ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసింది కానీ, పూర్తి స్థాయి విలన్ పాత్ర మాత్రం చెయ్యలేదు. అలా తనని పూర్తి స్థాయి విలన్ రోల్ చెయ్యించే డైరెక్టర్ కోసం ఆమె చాలా ఏళ్ళ నుండి పడిగాపులు కాస్తుందట. మరి ఆమె ఈ రెండు కోరికలను తీర్చే డైరెక్టర్ ఎప్పుడొస్తాడో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here