Rashmika టాలీవుడ్ లో అతి తక్కువ సమయం లోనే యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి నెంబర్ 1 రేస్ లో నిల్చిన హీరోయిన్ గా రష్మిక మందన పేరు చెప్పొచ్చు. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రష్మిక మందన, ఆ చిత్రం తర్వాత తెలుగు లో నాగ శౌర్య హీరో గా నటించిన ‘ఛలో’ అనే సినిమా ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది.
ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో ఆమెకి అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత ఆమె విజయ్ దేవరకొండ తో చేసిన ‘గీత గోవిందం’ చిత్రం మీడియం రేంజ్ సినిమాలలో ఇండస్ట్రీ హిట్ అవ్వడం తో ఈమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ అనతి కాలం లోనే సౌత్ లో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా బాలీవుడ్ లో ‘ఎనిమల్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇదంతా పక్కన పెడితే రాధికా శరీరం మీద ఉన్న రెండు టాటూలు ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశం అయ్యింది. ఈమె చేతి మీద రెండు టాటూలు ఉంటాయి.
ఒకటి మణికట్టు దగ్గర ‘ఇర్రీప్లేసబుల్’ అని ఉంటుంది. అంటే తన జీవితం లో ఉన్న ఒక వ్యక్తిని కానీ, వస్తువుని కానీ ఎవ్వరూ మ్యాచ్ చెయ్యలేరని దానర్థం. అదే చేతిమీద ఆమెకి ‘ఇన్ఫినిటీ’ అని ఉంటుంది. దీని అర్థం ‘అనంతం’ అని. ఇది ఆమె తనని ప్రేమిస్తున్న వాడి కోసం గుర్తు గా వేయించుకున్నట్టుగా అర్థం అవుతుంది. ‘నీ ప్రేమ అనంతం..నిన్ను నా మనసులో ఎవ్వరు రీప్లేస్ చెయ్యలేరు’ అనే అర్థం వచ్చే విధంగా ఆమె ఈ టాటూ వేయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.