Sreeleela ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ ని సంపాదించడం అనేది చిన్న విషయం కాదు. అందం తో పాటుగా యాక్టింగ్ , డ్యాన్స్ ఇలా అన్నీ కలలలో మెప్పించిన వారికే ఈ స్థాయి దక్కుతుంది. అలాంటి స్థాయిని కేవలం రెండు సినిమాలతోనే దక్కించుకుంది శ్రీలీల.

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ తెరకెక్కిన ‘పెళ్లి సందడి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీలీల, ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ తో కలిసి ‘ధమాకా’ చిత్రం లో నటించింది. కమర్షియల్ గా ఈ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుసగా శ్రీలీల డజన్ సినిమాల్లో నటించడానికి సంతకం చేసింది, అందులో అరడజను సినిమాలు విడుదలయ్యాయి.

వాటిల్లో కేవలం ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం తప్ప మిగిలినవన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే శ్రీలీల తన మెడికల్ పరీక్షల కోసం కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆ పరీక్షలకు వెళ్లే ముందు ఒక సినిమా చెయ్యాలని అనుకుంది. రీసెంట్ గానే ఒక క్రేజీ స్టార్ డైరెక్టర్ ఆమెకి సినిమా కథని పూర్తిగా వివరించాడు.

ఆ కథలో బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని, తప్పకుండ నటించాల్సి వస్తుందని డైరెక్టర్ చెప్పాడట. ఇదంతా విన్న శ్రీలీల మా అమ్మాయి అలాంటి సన్నివేశాల్లో నటించదు, ఇంకోసారి ఇలాంటి ఆలోచనలతో మా పాప దగ్గరకి వచ్చావంటే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి పంపిందట. శ్రీలీల గతం లో కూడా ఇలాంటి సన్నివేశాల్లో నటించను అని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఈమె కూడా రాబొయ్యే రోజుల్లో తమన్నా లాగ మనసు మార్చుకుంటుందా లేదా అనేది చూడాలి.
