Varun Tej : రీసెంట్ గానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు సోషల్ మీడియా లో వీళ్లకు సంబంధించి ఎదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంది. మిస్టర్ సినిమా తో ఏర్పడిన వీళ్లిద్దరి మధ్య పరిచయం, ఆ తర్వాత స్నేహంగా మారి, ప్రేమగా రూపాంతరం చెంది పెళ్ళికి దారి తీసింది.
గత ఏడాది లో వీళ్లిద్దరి పెళ్లి స్పెయిన్ లో ఎంతో ఘనంగా జరిగింది. సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్లకు దూరంగా కేవలం వరుణ్ తేజ్ కి బాగా దగ్గరైన వాళ్ళు, బంధు మిత్రుల సమక్షం లోనే వీళ్ళ పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నుండి ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక వరుణ్ తేజ్ లేటెస్ట్ గా ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే సినిమా చేసాడు. అతి త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించింది మూవీ టీం. అందులో భాగంగా వరుణ్ తేజ్ రీసెంట్ గానే మల్లా రెడ్డి కాలేజీ కి విచ్చేశాడు. అక్కడ ఆయన విద్యార్థులతో మాట్లాడుతుండగా ఒక స్టూడెంట్ ‘మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ‘ అని అడుగుతాడు.
అప్పుడు వరుణ్ దానికి సమాధానం చెప్తూ ‘నాకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరో మీ అందరికీ బాగా తెలుసు. ప్రస్తుతం ఆమె మా ఇంట్లోనే ఉంది’ అని అంటాడు. అప్పుడు ఆ స్టూడెంట్ ‘లావణ్య త్రిపాఠి కాకుండా మీకు ఎవరు బాగా ఇష్టం’ అని అడగగా దానికి వరుణ్ తేజ్ సమాధానం చెప్తూ ‘సాయి పల్లవి అంటే బాగా ఇష్టం’ అని బదులిచ్చాడు. దీంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది.