Actor Nani కి అర్జున్ అనే కొడుకు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇతనితో నాని కలిసి దిగిన క్యూట్ ఫోటోలను ఇది వరకు సోషల్ మీడియా లో మనం ఎన్నో చూసాము. అయితే ఈ చిన్న పిల్లాడు ఇప్పుడు కమల్ హాసన్ సినిమాకి సంగీత దర్శకత్వం వహించబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది.

అసలు విషయానికి వస్తే నాని రీసెంట్ గా మంచు మనోజ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఉస్తాద్’ అనే షో కి అతిథిగా వచ్చాడు. నానితో పాటుగా ఆయన వీరాభిమాని గా సోషల్ మీడియా లో పాపులర్ అయిన శ్రీప్రియా కూడా ఈ షో కి విచ్చేసింది. ఇద్దరు కలిసి కాసేపు మంచు మనోజ్ తో సరదా చిట్ చాట్ చేస్తూ, కొన్ని గేమ్స్ ఆడారు. అయితే మధ్యలో సరదాగా సాగిన ఒక ఫన్నీ డిస్కషన్ లో నాని తన కొడుకుతో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకున్నాడు.

నాని మాట్లాడుతూ ‘ఒక రోజు అర్జున్ పియానో తో మ్యూజిక్ వాయిస్తూ ఉన్నాడు. నేను వాడి దగ్గరకి వెళ్లి రేపు పెద్దయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేలా ఉన్నావ్. ముందుగా ఏ హీరోకి మ్యూజిక్ వాయిస్తావు రా అని అడిగాను, అప్పుడు వాడు నువ్వు మా నాన్నవి కాబట్టి ముందుగా నీ సినిమాకే మ్యూజిక్ అందిస్తాను. ఆ తర్వాత నీకు ఇష్టమైన హీరో కమల్ హాసన్ కదా, ఆయన సినిమాకి మ్యూజిక్ అందిస్తాను అని చెప్పాడు’ అంటూ నాని మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

వేలెడంత లేడు, అప్పుడే ఈ బుడ్డోడికి అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాని రీసెంట్ గానే ‘హాయ్ నాన్న’ చిత్రం తో భారీ హిట్ కొట్టాడు, ఈ సినిమా తర్వాత ఆయన ‘సరిపోయిందా శనివారం’ అనే చిత్రం లో నటిస్తున్నాడు.
