Guess The Actress : ఈ క్రింది ఫోటో లో గుండు గీసుకొని సన్యాసిలాగా కనిపిస్తున్న ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారా?, ఎక్కడ మన తెలుగు సినిమాల్లో చూడలేదే, ఎవరు ఈమె అని జుట్టు పీక్కుంటున్నారా?. ఈమె తెలుగు సినిమాల్లో నటించకపోవచ్చు, కాని మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ పోటీలలో ఐశ్వర్య రాయ్, సుస్మిత సేన్ లాంటి హీరోయిన్స్ తో తలపడి రన్నరప్ గా నిల్చింది.

ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో కూడా హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషించి బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. కెరీర్ మంచిగా వెళ్తున్న సమయం లోనే బౌద్ధ మతం తీసుకొని సన్యాసిగా మారి సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఆమె పేరు బర్ఖా మదన్. ఈమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం పదండి.

బర్ఖా మదన్ కి మొదటి నుండి సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చితోనే మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టింది. 1994 వ సంవత్సరంలో ‘ఫెమినా మిస్ ఇండియా’ పోటీలలో పాల్గొనింది. ఈ పోటీలలో ఐశ్వర్య రాయి కూడా పాల్గొనగా బర్ఖా మదన్ తొలి రన్నరప్ గా నిల్చింది. అలాగే ఈమె ‘మిస్ టూరిజం వరల్డ్ వైడ్’ పోటీలలో కూడా రన్నర్ గా నిల్చింది. అలా మోడలింగ్ రంగం లో పాపులారిటీ తెచ్చుకున్న బర్ఖా మదన్ కి 1996 వ సంవత్సరం లో ‘ఖిలాడీయో కా ఖిలాడీ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.

ఈ చిత్రం తర్వాత వరుసగా ఆమె ఆరు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్ లో అత్యధిక కాలం తన కెరీర్ ని కొనసాగించింది. అయితే ఆమెకి 2012 వ సంవత్సరం నుండే బౌద్ధ మతం లో సన్యాసం తీసుకోవాలని కోరికగా ఉండేదట, అప్పట్లో కుదర్లేదు కాని, ఇప్పుడు కుదిరించి. బౌద్ధ మతం లో చేరిన తర్వాత ఆమె తన పేరుని ‘గ్యాల్డన్ స్టామిన్’ గా మార్చుకుంది. తన ఇంస్టాగ్రామ్ మొత్తం ఆధ్యాత్మికతతో నిండిన సందేశాలు చెప్తూ, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది బర్ఖా మదన్.
