Samantha : సమంత, నాగచైతన్య ప్రేమ జంటని కేవలం వాళ్ళిద్దరి అభిమానులు మాత్రమే కాకుండా, టాలీవుడ్ లో ప్రతీ హీరో అభిమాని ఎంతో ఇష్టపడుతారు. చూసేందుకు మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగా అనిపించే ఈ జంటని చూసి ఎవరికీ మాత్రం ముచ్చట వెయ్యదు చెప్పండి. కానీ ఎంత మంది దిష్టి పెట్టారో ఏమో తెలియదు కానీ ఈ ప్రేమ జంట విడిపోయిన ఘటన అందరినీ ఎంతో బాధకి గురి చేసింది.

విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి జీవితం ని వాళ్ళు చూసుకుంటున్నారు కానీ, అభిమానులు మాత్రం వీళ్ళిద్దరినీ వేరు చేసి చూడలేకపోయారు. ఇదంతా పక్కన పెడితే నాగచైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో డేటింగ్ లో ఉన్నాడు. మా మధ్య ఏమి లేదని చెప్తున్నారు కానీ, వీళ్లిద్దరు కలిసి తిరగడం, ఎంజాయ్ చెయ్యడం వంటివి అందరూ చూసారు. సోషల్ మీడియా లో దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి.

నాగచైతన్య పరిస్థితి అలా ఉంటే, సమంత మాత్రం సోలో జీవితాన్ని గడుపుతుంది. ఇప్పటి వరకు ఆమె పలానా వ్యక్తితో కలిసి తిరిగినట్టు కానీ, పెళ్లి చేసుకోబోతున్నట్టు కానీ ఎలాంటి వార్త వినిపించలేదు. కానీ ఇప్పుడు ఇంట్లో సమంత రెండవ పెళ్లి గురించి చాలా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారట. ఇంకా ఎంత కాలం ఇలా ఒంటరిగా మిగిలిపోతావు, ఒకవయస్సు వచ్చిన తర్వాత భర్త లేని విలువ నీకు తెలుస్తుంది. పెళ్ళికి ఒప్పుకో అని ఆమెపై తీవ్రమైన ఒత్తిడి చేసి మొత్తానికి ఒప్పించారట.

అబ్బాయి సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తి కాదట, తన సొంత బంధువుల్లోనే సంబంధం చూసిందట. అబ్బాయి హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా నాగ చైతన్య కంటే వంద రేట్లు అందంగా ఉంటాడట. అతనికి సంబంధించిన ఫోటోలు త్వరలోనే విడుదల చేయనుంది సమంత. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
