Tollywood Actressఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు. లక్ కూడా ఉండాలి. అంతకంటే స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. అలా అయితేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతారు. హీరోయిన్లలో చాలామంది ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండ వచ్చినవారే ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మొదలు పెట్టి హీరోయిన్ వరకు ఎదిగినవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారు ఊరికే ఆ స్థాయికి చేరుకోలేదని, ఎన్నో ఇబ్బందులు.. అవమానాలు పడి ఇక్కడికి చేరుకున్నామని చెబుతుంటారు. ఈ జర్నీలో ఎన్నో మోసాలు, వెన్నుపోట్లు చూశామని ఇప్పటికే చాలామంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటకు చెప్పుకున్నారు.

తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా స్టార్ నిర్మాత చేతిలో మోసపోయానంటూ నోరువిప్పింది. ఆమే మాల్వీ మల్హోత్రా. “ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ భట్ పని చేయించుకుని రెమ్యునరేషన్ ఇవ్వకుండ మోసం చేశారు. ఆయన విక్రమ్ భట్ నిర్మించిన బర్బాద్ కర్ దియా అనే అల్బమ్ సాంగ్‌లో పనిచేయమని అడిగారు. అదే టైంలో నేను దక్షిణాది సినిమాలతో బిజీగా ఉన్నాను. స్వయంగా విక్రమ్ భట్ అడగడంతో కాదలేకపోయా. నా బిజీ షెడ్యూల్లోనూ వారి కోసం పనిచేశా.

అయితే దానికి నాకు ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. నేను సౌత్‌లో బిజీగా ఉండటం వల్ల వెంటనే అడగలేకపోయా. ఓసారి పెండింగ్ డబ్బుల కోసం ఫోన్ చేస్తే కనీసం విక్రమ్ భట్ రెస్పాండ్ అవ్వలేదు. చాలాసార్లు కాల్స్, మెసేజ్‌లు చేశాను. కానీ ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులుకు మరో సాంగ్‌లో నటించమని ఆయన అడిగారు. అప్పుడు చేయనని చెప్పేశాను. నా లా ఎవరూ ఆయన చేతిలో మోసపోకుడదనే నేను ఇప్పుడు ఈ విషయం బయటపెట్టాను” అంటూ చెప్పుకొచ్చింది. కాగా మాల్వీ ప్రస్తుతం రాజ్ తరుణ్ తిరగబడరా సామి సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.