Allu Arjun : సౌత్ ఇండియా లో స్టార్ హీరో కి ఉన్నంత క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు నయనతార. ఈమె తమిళం లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించింది కానీ, తెలుగు లో మాత్రం కేవలం ఎన్టీఆర్ , ప్రభాస్ తో మాత్రమే చేసింది. కానీ సీనియర్ హీరోలైన చిరంజీవి , నాగార్జున, బాలకృష్ణ మరియు వెంకటేష్ ఇలా అందరితో కలిసి నటించింది. అయితే నయనతార తో నటించడానికి నేటి తరం స్టార్ హీరోలు ఇష్టపడేవారు కాదట.
ఎందుకంటే ఆమె చాలా డిమాండ్ గా ఉంటుంది. ప్రతీ విషయంలోను లిమిట్స్ పెడుతుంది. ప్రొమోషన్స్ కి రాదు, ఈగో చాలా ఎక్కువ, ఇలా ఆమెపై చాలా రూమర్స్ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఒక అవార్డు ఫంక్షన్ లో ఈమె మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని చాలా ఘోరంగా అవమానించింది అట. దీనికి అల్లు అర్జున్ తో పాటుగా ఆయన అభిమానులు కూడా చాలా ఫీల్ అయ్యారు.
అసలు విషయానికి వస్తే రీసెంట్ గా జరిగిన ఒక అవార్డ్స్ ఫంక్షన్ కి అల్లు అర్జున్, నయనతార వచ్చారు. ఉత్తమనటి క్యాటగిరీ లో నయనతార కి ఒక సినిమాకి సంబంధించి అవార్డు వచ్చింది. ఈ అవార్డుని ఇవ్వాల్సిందిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని స్టేజి మీదకు ఆహ్వానించారు. స్టేజి మీదకి వెళ్లిన తర్వాత నయనతార ఆ అవార్డు ని అల్లు అర్జున్ చేతుల మీదుగా తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఈ అవార్డుని నా భర్త చేతుల మీదుగా తీసుకోవాలి అంటూ స్టేజి మీదనే చెప్పింది.
దీనికి అల్లు అర్జున్ చాలా అవమానం గా ఫీల్ అయ్యాడు. బాధతోనే స్టేజి దిగి క్రిందకి వెళ్ళిపోయాడు. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ సరికొత్త పాన్ ఇండియన్ మూవీ లో నయనతార ని హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుంది అని డైరెక్టర్ అనగా , ఆమెని తప్ప ఎవరినైనా తీసుకో, ఆమె మాత్రం నా సినిమాలో వద్దు అని తేల్చి చెప్పాడట.