Priyamani : హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోతున్నాయనుకున్న సమయంలో.. క్యాచీ కథలను ఎంచుకుంటూ.. ముందుకు సాగుతుంది ప్రియమణి . నారప్ప, విరాట పర్వం, కస్టడీ, జవాన్ ఇందుకు ఉదాహరణ. అలాగే ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. ఫ్యామిలీమాన్, హిజ్ స్టోరీ, భామా కలాపం సిరీస్, సినిమాలు మంచి రివ్యూస్ సాధించాయి. పెళ్లైతే అవకాశాలు తగ్గిపోతాయనే పదానికి ఈమె మినహాయింపు. అయితే ఇటీవల ఈమె నెగిటివిటీ మూటగట్టుకుంది.
దానికి కారణం నేరు సినిమా. మోహన్ లాల్, జీతు జోసెఫ్ కోర్టు డ్రామా మూవీ నేరులో ప్రియమణి పూర్ణిమ అనే క్యారెక్టర్‌లో నటించింది. ఇందులో నేరస్థుడి తరుపున లాయర్‌గా ప్రియమణి వాదించడంతో.. ఆమెను తిట్టిపోస్తున్నారు ఈ చిత్రాన్ని చూసిన వీక్షకులు. అందులో విలన్ తప్పు చేశాడని తెలిసినా, డబ్బు కోసం తన తండ్రి తరుఫున వకాల్తా పుచ్చుకుని.. ఆర్గ్యూ చేస్తుంది. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
కానీ కొందరు పనిగట్టుకుని విమర్శిస్తున్నారు. హీరోయిన్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అది కేవలం నటనేనని మర్చిపోయి వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. బేబి మూవీలో వైష్ణవి విషయంలో ఇదే జరిగింది. భిన్నమైన క్యారెక్టర్ చేస్తేనే నటిగా గుర్తింపు దక్కుతుంది. ఇలా ప్రియమణికి ప్రతికూలత వస్తుందంటే.. నటిగా సెంట్ పర్సంట్ సక్సెస్ అయినట్లే. సో విమర్శలు మానేసి.. సినిమాను సినిమాగా చూస్తే.. వాళ్లు కూడా కొత్తగా కనిపించేందుకు అవకాశం ఉంటుంది.