Poonam Pandey ఇటీవలే ప్రముఖ హీరోయిన్ పూనమ్ పాండే చనిపోయినట్టు సోషల్ మీడియా లో వచ్చిన వార్త ఎంత పెద్ద దుమారం రేపిందో మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఆకతాయిలు పుట్టించే పుకారు అయ్యుంటే పెద్దగా సమస్య అయ్యేది కాదు కానీ, పూనమ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి స్వయంగా తానే చనిపోయినట్టుగా తన మ్యానేజర్ చేత పోస్టు చేయించింది.
దీంతో ఒక్కసారిగా అందరూ శోకసంద్రం లో మునిగిపోయారు. సరిగ్గా 32 ఏళ్ళ వయస్సు కూడా లేని పూనమ్ ఇలా చనిపోవడం బాధాకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ సంతాపం ని వ్యక్త పరిచారు. అయితే అదంతా ప్రాంక్ అని, కేవలం సర్వైవల్ క్యాన్సర్ గురించి అందరూ మాట్లాడుకునేలా ఇలా చేసానని చెప్పుకొచ్చింది. దీనిపై ప్రముఖ నటి కస్తూరి చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
ఆమె మాట్లాడుతూ ‘పూనమ్ పాండే చనిపోయిన వార్త ని నేను అంత పెద్ద వార్తగా అనుకోవడం లేదు. ఆమె ఇలా చావుని అడ్డు పెట్టుకొని ఇంతమందిని ఫూల్స్ చెయ్యడం కరెక్ట్ కాదు. సర్వైవల్ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచడం కోసం అలా చేశాను అంటుంది. ఆమెకి నిజంగా ఆ ఆలోచనే ఉంటే దానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఈ మార్గం ని ఎంచుకోవడం దురదృష్టకరం. సర్వైవల్ క్యాన్సర్ తో ఎంతో మంది మహిళలు బాధపడుతున్నారు. ఆమె వాళ్ళ కోసం పెద్ద మొత్తం లో విరాళం అందించి ఉండొచ్చు, కానీ అలా చెయ్యలేదు. ఆమెకి ఇలాంటి చీప్ పబ్లిసిటీ పిచ్చి ఎప్పటి నుండో ఉంది. ఇంకా నయం ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పలేదు’ అంటూ కస్తూరి చాలా తీవ్రంగా విరుచుకుపడింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.