Suma Kanakala : సుమ వేసుకునే బట్టలపై సెటైర్లు వేస్తూ అందరి ముందు పరువు తీసేసిన కొడుకు రోషన్!

- Advertisement -

Suma Kanakala : బుల్లితెర పై దశాబ్దాలుగా స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ఆమె కెరీర్ కొనసాగిస్తున్న ఇన్ని సంవత్సరాలలో ఎంతో మంది కొత్త యాంకర్లు వచ్చారు, వెళ్లారు. కానీ సుమ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఈమె లేకపోతే జరిగే పరిస్థితి లేదు. చిన్న హీరో దగ్గర నుండి పెద్ద స్టార్ హీరో సినిమా వరకు ప్రతీ ఒక్కరు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి సుమ ని యాంకర్ గా పెట్టుకుంటారు.

ఆ డిమాండ్ ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె కొడుకు రోషన్ ‘బబ్లీగమ్’ అనే సినిమా ద్వారా మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఆ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే రీసెంట్ గా రోషన్ తన తల్లి సుమ మీద చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

అసలు విషయానికి వస్తే ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ హీరో గా ‘బూట్ కట్ బాలరాజు’ అనే సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుమ యాంకరింగ్ చేసింది. ఆమెతో పాటుగా ఆమె కొడుకు రోషన్ కూడా ఈ ఈవెంట్ కి వచ్చాడు. సుమ ఈ ఈవెంట్ లో స్టైల్ లో ప్యాంట్ వేసుకొని మోడరన్ లుక్ లో వచ్చింది. సుమ ని చూడగానే రోషన్ ఇక్కడ మా అమ్మ ఉండాలి ఏమైంది అని వెతుక్కుంటూ ఉంటాడు.

- Advertisement -

అప్పుడు సుమ ఇక్కడ ఉన్నాను రా అని అనగా, క్షమించు అమ్మా, డ్రెస్ ని చూసి నువ్వు ఎవరో గుర్తుపట్టలేకపోయాను అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే సుమ ఈ ఈవెంట్ ని చెయ్యడానికి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here