Rashmika Mandanna : ఆమె పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు అంటూ రష్మిక పై మండిపడ్డ స్టార్ హీరో!

- Advertisement -

Rashmika Mandanna : గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో సౌందర్య బయోపిక్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తనకి సౌందర్య అంటే చాలా ఇష్టమని, అవకాశం వస్తే ఆమె బయోపిక్ లో నటిస్తానంటూ ఒక కామెంట్ చేసింది. సోషల్ మీడియా లో రష్మిక ని ఇష్టపడేవాళ్లు ఎంతమంది ఉంటారో, ద్వేషించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు.

Rashmika Mandanna
Rashmika Mandanna

ఆమె ఎప్పుడైతే ఈ కామెంట్ చేసిందో, అప్పటి నుండి సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోలింగ్స్ జరిగాయి. సౌందర్య బయోపిక్ లో నువ్వు నటిస్తావా?, ఆమె లాగ సహజమైన నటన కనబర్చడం నీ వల్ల అవుతుందా, పగటి కలలు కనకు అంటూ ఆమెని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో ట్రోల్ చేసారు. అయితే రష్మిక వ్యాఖ్యలకు రీసెంట్ గా టాలీవుడ్ లో ఒక సీనియర్ డైరెక్టర్ చాలా ఘాటు రియాక్షన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Soundarya

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రష్మిక కోరిక ని ఆ డైరెక్టర్ కి ఒక యాంకర్ వినిపించగా, ఆయన దానికి సమాధానం చెప్తూ ‘సౌందర్య జీవిత చరిత్రని ఈ తరం లో ఏ హీరోయిన్ కూడా పోషించడానికి అర్హులు కాదు. కనీసం ఆమె పేరు ఎత్తడానికి కూడా సరితూగరు’ అంటూ కామెంట్ చేసాడు. అయితే రష్మిక ఫ్యాన్స్ మాత్రం అతని కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

- Advertisement -
Soundarya rashmika mandanna

మహానటి సావిత్రి బయోపిక్ ని తీస్తున్నప్పుడు కూడా కీర్తి సురేష్ ని ఇలాగే అన్నారు. కానీ చివరికి ఏమైంది, సావిత్రి గారే దివి నుండి భువికి దిగి వచ్చి వెండితెర పై కనిపించారా అనేంత అద్భుతంగా నటించి నేషనల్ అవార్డు కొట్టింది. రష్మిక కూడా సౌందర్య పాత్రలో ఆ రేంజ్ లో నటిస్తుందేమో ఎవరికి తెలుసు, అవకాశం ఇచ్చి చూస్తే కదా తెలిసేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here