Vijay Varma – Tamannaah : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్లుగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో తమన్నా, విజయ్ వర్మ జంట ఒకటి. వీరిద్దరూ ఇప్పుడు ఇండస్ట్రీలో నటులుగా వెలుగొందుతున్నారు. వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2లో నటించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వారి డేటింగ్ విషయం బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లినా వారు జంటగానే కనిపిస్తున్నారు.
ఈ విధంగా తమన్నా, విజయ్ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు విజయ్ వర్మను తమన్నాతో వివాహం గురించి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు విజయ్ స్పందిస్తూ.. ఇప్పటికే నా మేనకోడలు మా అమ్మను ఇలాంటి ప్రశ్నలు అడుగుతోంది.. నేను హైదరాబాద్‌లో కూడా చాలా సార్లు ఈ ప్రశ్న ఎదుర్కొన్నా అంటూ తనస్టైల్‌లో చమత్కరించాడు.
దీంతో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తెలివిగా దాటేశాడని సమాచారం. ఇక ఈ ఏడాదిలోనే తమన్నా, విజయ్ వర్మ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. వచ్చే రెండు, మూడు నెలలలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారట. తమన్నా సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు కుటుంబ సభ్యులందరూ కూడా పలు ఆలయాలను సందర్శించాల్సి ఉంటుందట. ప్రస్తుతం తమన్న ఆ పనిలోనే ఉందని తెలుస్తుంది. త్వరలోనే వీరి పెళ్లి డేట్ గురించి కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.