Bigg Boss Priyanka : సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించి, వచ్చిన ఆ క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది ప్రియాంక జైన్. మొదటి నుండి ఈమె మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి. ఆ అంచనాలను నిజం చెయ్యడం లో ఈ బ్యూటీ సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు మగవాళ్ళతో సమానం గా ప్రతీ టాస్కుని అద్భుతంగా ఆడుతూ లేడీ టైగర్ గా పేరు తెచ్చుకుంది.
అంతే కాకుండా ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈమెకి బయట మిగిలిన కంటెస్టెంట్స్ లాగ ఒక్కరంటే ఒక్క సెలబ్రిటీ కూడా ఈమెని ప్రమోట్ చెయ్యలేదు. అయినప్పటికీ కూడా ఈమెని జనాలు టాప్ 5 లో పెట్టారు. ఈ సీజన్ 7 లో అత్యధికంగా లేడీ కంటెస్టెంట్స్ వచ్చారు. కానీ వాళ్ళందరిని అడిగిమంచి ప్రియాంక జైన్ టాప్ 5 లో నిలబడడం నిజంగా గ్రేట్.
అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన వెంటనే ఆమెకి టీవీ సీరియల్స్ మరియు సినిమాల్లో అవకాశాలు క్యూలు కడుతుందని ఆమె ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఈమె ఒక్క ప్రాజెక్ట్ కి కూడా సైన్ చెయ్యలేదు. రెండు రోజులకు ఒకసారి తన ‘నెవెర్ ఎండింగ్ టేల్స్’ యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో చేస్తూ వస్తుంది కానీ, తన రాబోయే ప్రాజెక్ట్స్ గురించి ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. ఇకపోతే ఈమె చాలా కాలం నుండి తన తోటి నటుడు శివ్ తో ప్రేమలో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు కలిసి గతం లో ‘మౌనరాగం’ అనే సీరియల్ లో చేసారు. ఆ సీరియల్ పెద్ద హిట్ అయ్యింది.
ఈ సీరియల్ షూటింగ్ సమయంలోనే ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. అప్పటి నుండి ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్ చేసుకుంటున్నారు. కానీ పెళ్లి గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రియాంక ని అడగగా ‘ఎందుకు పెళ్లి చెప్పండి..ఎంతో సంతోషంగా డేటింగ్ చేసుకుంటున్నాం, ఇప్పుడు పెళ్లి, దానికి మళ్ళీ ఖర్చులు అవసరమా?, మేము ఇలాగే డేటింగ్ చేసుకుంటూ ఉంటాం’ అంటూ ప్రియాంక మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.