Namrata Shirodkar : కొరటాల శివ – మహేష్ బాబు కాంబోలో శ్రీమంతుడు సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మంచి కలెక్షన్లను రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థల్లో మహేష్ బాబుకి సంబంధించిన జీఎన్ జీ కంపెనీ కూడా భాగం కావడంతో మహేష్ బాబును ఈ కేసు నుంచి తప్పించేందుకు నమ్రత మాస్టర్ ప్లాన్ వేసింది. అయితే మహేష్‌ని తప్పించడానికి నమ్రత ఏం చేసిందో చూద్దాం.
ఈ సినిమా కాపీరైట్ వివాదం తర్వాత నమ్రత మహేష్ బాబు పేరును తొలగించి బ్యానర్లో గంగాధర్ పేరును చేర్చారు. నమ్రత తెలివిని ఇలా వాడుకోవడం వల్ల మహేష్ బాబుకు ఇబ్బంది కలగకుండా శ్రీమంతుడు వివాదం బాధ్యత అంతా కొరటాల శివపై పడిందని సమాచారం. మరోవైపు ఈ కేసు నుంచి బయటపడే దిశగా కొరటాల శివ అడుగులు వేస్తున్నారు. మహేష్ సర్కార్ వారి పాట, గుంటూరు కారం సినిమాలు విజయవంతమయ్యాయి. మహేష్ రేంజ్ హిట్ ఆ సినిమాలలో ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు మహేష్ బాబు-రాజమౌళి కాంబోకి స్క్రిప్ట్ సిద్ధమవుతోంది.
ఈ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని.. మహేష్ బాబుకు కూడా స్క్రిప్ట్ బాగా నచ్చిందని సమాచారం. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబుకు మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ త్వరగా సినిమాలు చేయాల్సి వస్తుందని, ఇది మహేష్ కెరీర్ కు నష్టమని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్స్ మార్చుకునే పనిలో ఉన్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు జిమ్ బాడీని బిల్డప్ చేయబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక నుంచి పెద్ద సినిమాల్లోనే నటిస్తున్నాడని తెలుస్తోంది.