Anchor Anasuya : సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్, పబ్లిసిటీ, ప్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ. ఆ పేరు కష్టానికి మరో మారుపేరుగా చెప్పుకోవచ్చు. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు బిజీ యాక్టర్ గా దూసుకుపోతుంది. ఈ స్టాయికి రావడానికి ఆమె ఎంత కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది.
ఇటీవల అనసూయ కి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనసూయ సినిమాలో కంటెంట్ ఉంటేనే నటిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే . అలాంటి అనసూయ పాత్ర నచ్చితే ఎంతటి రిస్క్ చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. రీసెంట్ గా ఆమె ఓ స్టార్ హీరోకి తల్లిగా నటించబోతుందట . అయితే అది స్టార్ హీరో చిన్నప్పటి పాత్ర అయినప్పటికీ చాలా ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందట. ఇది ఫుల్ టు ఫుల్ మదర్ సెంటిమెంట్ ని బేస్ చేసుకుని తెరకెక్కబోతుందట .
ఈ పాత్ర చేస్తే ఆమెను ట్రోల్ చేస్తారన్న విషయం కూడా తెలిసి.. అయినా అనసూయ ఈ పాత్ర చేయడానికి ఓకే చేసిందట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఇది తెలిసిన కొంతమంది అనసూయను గ్రేట్ అంటూ పొగిడేస్తుంటే.. మరి కొంతమంది వ్యంగ్యంగా ఈ వయసులో తల్లి కాబోతున్నావా..? అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ కి ట్రోలింగ్ కొత్త ఏం కాదు. తన జోలికి వస్తే ఇచ్చిపడేస్తుంది.