Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనకి తెలియాల్సిన విషయాలు ఏమి లేవు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తండ్రినే మించిన తనయుడిగా ఎదిగాడు. యూత్ , మాస్ , ఫ్యామిలీ ఇలా అన్నీ వర్గాల ఆడియన్స్ ని మెప్పించిన సినిమాలు నేటి తరం హీరోలలో కేవలం మహేష్ బాబు మాత్రమే చేసాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అందుకే ఆయన సినిమాలు ఈమధ్య కాలం లో టాక్ తో సంబంధం లేకుండా ఆడేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు యాడ్స్ రంగం లో కింగ్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈయన చేసినన్ని కమర్షియల్ యాడ్స్ టాలీవుడ్ లో ఏ హీరో కూడా చెయ్యలేదు. అయితే కొన్ని యాడ్స్ అభిమానులకు ఇబ్బంది కలిగించాయి. అలాంటి యాడ్స్ లో ఒకటి జీ టీవీ సీరియల్స్ కోసం మహేష్ బాబు చేసిన యాడ్ వీడియో.
అప్పట్లో జీటీవీ లో కొత్తగా ప్రసారం అవ్వబొయ్యే డైలీ సీరియల్స్ అన్నిటికి కలిపి మహేష్ బాబు ఒక యాడ్ చేసాడు. అయితే ఈ యాడ్ షూటింగ్ సమయం లో డైరెక్టర్ చెప్పిన కాన్సెప్ట్ మహేష్ బాబు కి నచ్చలేదు. దీంతో ఆయనే స్వయంగా ఒక ఐడియా ఇచ్చాడట. ఆ ఐడియా కి తగ్గట్టుగా స్క్రిప్ట్ ని మార్చి ఆ యాడ్ ని చేసాడట. చాలా వరకు ఈ యాడ్ లో సీరియల్ ఆర్టిస్టులకు ఎలా చెయ్యాలో మహేష్ బాబు వివరించి చెప్పాడట.
అంటే దాదాపుగా ఆయనే ఈ యాడ్ కి డైరెక్టర్ అనుకోవచ్చు. అదే రోజున ‘త్రినయని’ అనే సీరియల్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది అట. ఈ సీరియల్ కి సంబంధించిన మొదటి షాట్ కి మహేష్ బాబు దర్శకత్వం వహించాడట. ఆయనది ఎంత లక్కీ హ్యాండ్ అనేది ఇప్పుడు అర్థం అవుతుంది. ఈ సీరియల్ ఇప్పటికీ టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది.