Actress Anushka Shetty వివాదాలకు దూరం గా ఉండే హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి. అందరి హీరోయిన్స్ లాగ ఈమె మీడియా కి దగ్గరయ్యే వ్యక్తి కాదు. చాలా ప్రైవేట్ మనిషి అనే చెప్పొచ్చు. ఆమె ఇంటర్వ్యూస్ ఇచ్చిన సందర్భాలను కూడా చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. అంత తక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తుంది. ఇక సోషల్ మీడియా లో ఆమె తోటి స్టార్ హీరోయిన్స్ ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలలో ఏ రేంజ్ లో తమకి సంబంధించిన ఫోటోలను వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం.
కానీ అనుష్క శెట్టి మాత్రం అందుకు పూర్తిగా బిన్నం. ఆమె సోషల్ మీడియా లో ఉన్నప్పటికీ కూడా పెద్దగా యాక్టీవ్ గా ఉండదు. కానీ సోషల్ మీడియా లో ఉండే గాసిప్ రాయుళ్లు మాత్రం అనుష్క మీద ప్రతీ రోజు ఎదో ఒక పుకారు పుట్టిస్తూనే ఉంటారు. కారణం ఇప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోకపోవడమే.
అయితే రీసెంట్ గా ఆమె ఒక ప్రముఖ క్రికెటర్ ని వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి. పలు సైట్స్ లో అయితే ఆమె వివాహం చేసుకున్నట్టు మార్ఫింగ్ ఫోటోలను కూడా చేసి ప్రచారం చేసారు. దీనిపై అనుష్క శెట్టి రియాక్షన్ ఎలా ఉందో తెలియదు కానీ, ఆమె తల్లితండ్రులు రియాక్షన్ మాత్రం చాలా ఫైర్ మీద ఉందని టాక్. డీప్ ఫేక్ వీడియో తో అనుష్క కి ఆ స్టార్ క్రికెటర్ తో సంబంధం ఉన్నట్టు, అతనితో రొమాన్స్ చేసినట్టుగా పలు వీడియోలను సోషల్ మీడియా లో ప్రచారం చేసారు.
దీనిపై అనుష్క తల్లితండ్రులు త్వరలోనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు అట. సెలబ్రిటీస్ అన్న తర్వాత రూమర్స్ రావడం అనేది సహజం. కానీ డబ్బుల కోసం హద్దులే దాటినా రూమర్స్ ని ప్రచారం చేస్తే, ఇలాగే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇకనైనా గాసిప్స్ రాయుళ్లు జాగ్రత్తగా ఉంటే బెటర్.