Yatra 2 Movie Review : 2019 వ సంవత్సరం లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని ఆధారంగా తీసుకొని మహి పీ రాఘవ్ అనే దర్శకుడు తెరకెక్కించిన ‘యాత్ర’ అనే చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా జగన్ సీఎం అయ్యేందుకు ఒక మెట్టుగా ఉపయోగపడింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి లాభాల వర్షం కురిపించింది.
ఈ సినిమాకి సీక్వెల్ గా జగన్ బయోపిక్ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు మహి పీ రాఘవ్ యాత్ర విడుదల సమయం లోనే ప్రకటించాడు. అది ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి ప్రతికూల వాతావరణాలు ఎదురు అయ్యాయి. జగన్ పై ఎన్ని కుట్రలు జరిగాయి అనే అంశాన్ని తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఈ సినిమా ఈ నెల 8 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి మొదటి కాపీ ని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది బయ్యర్స్ కి వేసి చూపించారట. ఈ సినిమాని చూసిన తర్వాత వాళ్ళ కళ్ళు చెమర్చాయి అట. సీఎం జగన్ ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూసారో, ఆయనపై అక్రమ కేసులు ఎలాంటివి వేసారో, దాని వాళ్ళ ఆయన ఎదురుకున్న బాధని కళ్ళకు కట్టినట్టు చూపించాడట డైరెక్టర్ మహి.
జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించలేదు, జీవించాడు అని అంటున్నారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ 2019 వ సంవత్సరం లో అఖండ మెజారిటీ తో సీఎం అయ్యే వరకు జగన్ ప్రస్థానం ఎలా కొనసాగిందో ఈ చిత్రం లో చూపించారట. ఇది జగన్ ఫ్యాన్స్ కి ఒక ఎమోషనల్ రొల్లర్ కోస్టర్ గా ఉంటుందట.