Mrunal Thakur : ఆ హీరోతో లిప్ లాక్ చేసే అదృష్టం రానందుకు బాధపడుతున్నాను – మృణాల్ ఠాకూర్

- Advertisement -

Mrunal Thakur : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన ఈమె ఆ ఒక్క సినిమాతోనే అటు అందం తోను, ఇటు నటనతో కోట్లాది మంది అభిమానుల మనసుల్ని కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత ఆమెకి ఎన్నో ఆఫర్లు వచ్చాయి, కానీ చేతికి వచ్చిన ప్రతీ ఆఫర్ ని ఒప్పుకోకుండా కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసేందుకు మొగ్గు చూపిస్తుంది.

Mrunal Thakur
Mrunal Thakur

‘సీతారామం’ తర్వాత ఆమె చేసిన ‘హాయ్ నాన్న’ చిత్రం కూడా అలాంటిదే. ఈ సినిమాలో ఆమె ఎంత అద్భుతంగా నటించిందో మనమంతా చూసాము. ఇప్పుడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ‘ఫ్యామిలీ స్టార్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో కూడా ఆమె నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రనే చేసింది.

Hrithik Roshan Mrunal Thakur

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె బాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు హృతిక్ రోషన్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది కానీ, అతనితో రొమాన్స్ చేసే అవకాశం మాత్రం రాలేదు. కేవలం యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్ర చెయ్యడం వల్ల అలా జరిగింది. హృతిక్ లాంటి హీరో తో సినిమా అంటే ఏ హీరోయిన్ కి అయినా రొమాన్స్ సన్నివేశాల్లో నటించాలని ఉంటుంది కదా, అలాంటి ఛాన్స్ మిస్ అయ్యినందుకు బాధవేసింది.

- Advertisement -

అంతే కాకుండా అతనితో కలిసి డ్యాన్స్ వెయ్యాలి అనేది కూడా నా కోరిక. అది కూడా నెరవేరలేదు. షాహిద్ కపూర్ తో కూడా కలిసి డ్యాన్స్ వెయ్యాలి అనేది నా కోరిక. అతనితో జెర్సీ సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది కానీ, డ్యాన్స్ వేసే అవకాశం రాలేదు’ అంటూ చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here