Tripthi Dimbri : ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. యానిమల్ లో సైడ్ హీరోయిన్ గా నటించిన ఈమె మెయిన్ హీరోయిన్ కన్నా ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది. కనిపించింది కాసేపే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్ తో యూత్ ని కట్టి పడేసింది. దాంతో ఈ ముద్దుగుమ్మకి ఒక్కసారిగా భారీ పాపులారిటీ వచ్చేసింది. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన రష్మికకి కూడా రాని గుర్తింపు యానిమల్ తో సొంతం చేసుకుంది తృప్తి. ఇప్పుడు బాలీవుడ్ లో ఎలాంటి ఈవెంట్ జరిగినా ఆమెనే పిలుస్తున్నారు.

అంతేకాదు గత నెలలో గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీస్ లో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం తృప్తి దిమ్రి కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తృప్తి దిమ్రికి పెళ్లి గురించి ప్రశ్న ఎదురవడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా..’ ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదని, ఇప్పటికైతే తన కెరీర్‌పైనే శ్రద్ద పెట్టానని’ చెప్పింది.

అయితే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో మాత్రం చెబుతూ..” డబ్బు, పాపులారిటీ సంగతి పక్కన పెడితే.. మంచి మనస్సున్న వ్యక్తి అయి ఉండాలి”అని చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లి, గురించి కాబోయే భర్త గురించి ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. అందులో ఒకటి షూటింగ్ దశలో ఉండగా.. మరొకటి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.