Sandeep Vanga : ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ సమయం లోనే పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ వంగ. విజయ్ దేవరకొండా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో కెరీర్ ని ప్రారంభించిన ఆయన నేడు ‘ఎనిమల్’ సినిమా తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో షేక్ చేసాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. చేస్తే ఇలాంటి డైరెక్టర్ తోనే మా హీరో పాన్ ఇండియన్ సినిమా చెయ్యాలని ప్రతీ సూపర్ స్టార్ అభిమాని కోరుకుంటున్నారు.
ఆ రేంజ్ లో ఆయన యూత్ లో ప్రభావం చూపించాడు. అయితే రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన ‘ఎనిమల్’ చిత్రం ఓటీటీ లో ప్రసారం అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో గత కొద్దిరోజుల క్రితమే మొదలైన ఈ సినిమా స్ట్రీమింగ్ ని చూసి పలువురు నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తే, కొంతమంది మాత్రం చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
పలువురు సెలబ్రిటీస్ అయితే చాలా తీవ్ర స్థాయిలో ఓపెన్ గానే ఇదొక సినిమానా అని తిట్టారు. వారిలో సీనియర్ హీరోయిన్స్ రాధికా శరత్ కుమార్, కస్తూరి వంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఆ జాబితాలోకి మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయినట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనని అభినందించేందుకు సందీప్ వంగ చిరంజీవి ఇంటికి వెళ్లి పుష్ప గుచ్చం ఇచ్చాడు.
అనంతరం కాసేపు ముచ్చటించిన చిరంజీవి ‘ఎనిమల్‘ సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడట. సినిమా బాగానే ఉంది కానీ, మధ్యలో ఆ రేంజ్ బోల్డ్ సన్నివేశాలు పేట్టావేంటి అయ్యా, సురేఖ కి అలవాటులో పొరపాటుగా నిన్ననే ఈ సినిమా చూసింది, నిన్ను పచ్చి బూతులు తిట్టుకుంది. నాతో సినిమా చెయ్యాలని అంటున్నావ్, ఇలాంటి సన్నివేశాలు పెడుతావా ఏంటి కొంపదీసి అని చిరంజీవి కాసేపు సందీప్ వంగ కి క్లాస్ పీకినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.