Tasty Teja : ఈమధ్య కాలం లో సెలబ్రిటీస్ కి సినిమాలు, సీరియల్స్ కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా సంపాదన ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన సెలబ్రిటీస్ అయితే ఎక్కువగా యూట్యూబ్ ద్వారానే డబ్బులను సంపాదిస్తున్నారు. ఉదాహరణకి ప్రియాంక, శోభా శెట్టి వంటి వారు సీరియల్స్, సినిమాలకంటే కూడా ఎక్కువగా యూట్యూబ్ సంపాదన మీదనే ఆధారపడ్డారు.Tasty Teja : ఈమధ్య కాలం లో సెలబ్రిటీస్ కి సినిమాలు, సీరియల్స్ కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా సంపాదన ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన సెలబ్రిటీస్ అయితే ఎక్కువగా యూట్యూబ్ ద్వారానే డబ్బులను సంపాదిస్తున్నారు. ఉదాహరణకి ప్రియాంక, శోభా శెట్టి వంటి వారు సీరియల్స్, సినిమాలకంటే కూడా ఎక్కువగా యూట్యూబ్ సంపాదన మీదనే ఆధారపడ్డారు.
ప్రాంక్ వీడియోస్,ఫన్నీ వీడియోస్ అని ఎదో ఒకటి అప్లోడ్ చేస్తూ వ్యూస్ ని సంపాదించి నెలకు లక్షల్లో జీతాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకడు టేస్టీ తేజా. ఇతను ప్రముఖ యూట్యూబర్ గా పేరు తెచ్చుకొని, ఆ ఫేమ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు టేస్టీ తేజా మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాలుగు వారాలకే ఎలిమినేట్ అవుతాడని అనుకున్న టేస్టీ తేజా 9 వారాలు హౌస్ లో కొనసాగాడు.
యూట్యూబ్ లో టేస్టీ తేజా పేరుతో ఈయనకి ఒక పాపులర్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ ద్వారా ఆయన ప్రముఖ స్టార్ సెలబ్రిటీస్ తో ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. హైదరాబాద్ నగరం లో పాపులర్ రెస్టారెంట్స్ లోకి సెలబ్రిటీస్ ని తీసుకెళ్లి వాళ్లకు ఇష్టమైన ఫుడ్ ని పెట్టించి, కాసేపు ఫన్నీ చిట్ చాట్ చేస్తుంటాడు. విడుదలకు దగ్గరయ్యే సినిమాలకు సంబంధించిన నటీనటులు టేస్టీ తేజా ఛానల్ లో ఫుడ్ వీడియోస్ వీడియోస్ చేస్తూ ప్రొమోషన్స్ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తారు.
రీసెంట్ గా న్యాచురల్ స్టార్ నాని కూడా తన ‘హాయ్ నాన్న’ ప్రొమోషన్స్ లో భాగంగా టేస్టీ తేజా ఛానల్ కి విచ్చేశాడు. అలా ఈ ఛానల్ ద్వారా టేస్టీ తేజ నెలకు 30 నుండి 45 లక్షల రూపాయిల వరకు సంపాదిస్తున్నాడని టాక్. బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆయనకి మరింత ఫేమ్ కూడా వచ్చింది.