Shradha Das : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందం తో పాటు, చక్కటి అభినయం ఉన్న హీరోయిన్స్ లో ఒకరు శ్రద్దా దాస్. కానీ ఈమె బ్యాడ్ లక్, హీరోయిన్ గా నటించిన సినిమాలను చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. ప్రతీ సినిమాలోనూ ఈమె సెకండ్ హీరోయిన్ గానే చేస్తూ వచ్చింది. చివరికి మీడియం రేంజ్ హీరోలు, చిన్న హీరోలు కూడా ఈమెని మెయిన్ హీరోయిన్ గా పెట్టుకొని సినిమాలు చేసిన దాఖలాలు లేవు.
అందుకే ఇండస్ట్రీ లో కనిపించకుండా మాయం అయ్యింది. అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో విలన్ రోల్స్ కూడా చేసింది. ఇకపోతే ఈమెకి మధ్యలో అప్పట్లో బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి. తెలుగు సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా చేసే అవకాశం రాకపోయినా, బాలీవుడ్ లో మాత్రం ఆ అవకాశం దక్కింది. ఈమె హీరోయిన్ గా నటించిన ‘జిద్’ అనే చిత్రం అప్పట్లో విడుదలై పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది.
ఈ సినిమాలో శ్రద్ద దాస్ హీరోయిన్ గా నటించగా, ప్రియాంక చోప్రా కజిన్ మన్నారా చోప్రా విలన్ గా నటించింది. ఈమె బిగ్ బాస్ హిందీ లేటెస్ట్ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చింది. అయితే ఈమె గురించి శ్రద్ద దాస్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘ జిద్ సినిమా షూటింగ్ సమయం లో మన్నారా చోప్రా నన్ను పెట్టిన టార్చర్ సాధారణమైనది కాదు.ఒక సన్నివేశం లో ఆమె నన్ను మెట్ల మీద నుండి తొయ్యాలి. డైరెక్టర్ చిన్నగా తొయ్యమని చెప్పగా, మన్నారా చోప్రా తన బలం మొత్తం చూపించి తోసింది. కొద్దిగలో నా ప్రాణాలే పోయేవి. ఒక సన్నివేశం లో ఆమె నా ఛాతి మీద కొట్టాలి. నేను ముందుగానే చెప్పాను, దయచేసి చిన్నగా కొట్టు అని, కానీ ఆమె వినిపించుకోకుండా చాలా బలంగా కొట్టింది, నిజమైన కర్ర తీసుకొని చితక బాదింది. దాంతో నేను హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, కొద్దిగా లో ఉంటే నేనే కోమాలోకి వెళ్లేదానిని అని డాక్టర్లు తెలిపారు’ అంటూ మన్నారా చోప్రా గురించి శ్రద్ద చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.