Prashanth Neel రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కు రూ.700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో భారీ కమ్ బ్యా్క్ ఇచ్చిన సినిమా సలార్. సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ అభిమానుల దాహార్తిని తీర్చిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో కేజీఎఫ్ బ్లాక్‌బస్టర్ సిరీస్‌ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సినిమాలో ప్రభాస్‌ని చూపించిన విధానం, స్క్రీన్‌ప్లేతో చేసిన మ్యాజిక్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి.
ఇటీవలే సలార్ థియేటర్ల సందడి ముగిసింది. ఇటీవల ఈ సినిమా OTT లో విడుదలైంది. ఈ సినిమాపై సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర రివ్యూ ఇచ్చారు. యాక్షన్, జానపదం, పౌరాణికం, సాంఘిక అంశాలు అన్నీ మేళవించి ప్రశాంత్ సలార్ సినిమా రూపొందించారని వివరించారు. అయితే సలార్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తప్పా.. ఇంకెవరు తెరకెక్కించినా అంతగా ఆడేది కాదని వ్యాఖ్యానించారు. వేరే డైరెక్టర్ కనుక ఈ కథతో సినిమా చేస్తే ఆడుతుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అంటూ వివరించాడు.
ఇది ఇలా ఉంటే, మొదటి 30 నిమిషాల పాటు ప్రభాస్ డైలాగ్ చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కాన్సర్ అనే ప్రాంతాన్ని చరిత్రతో మిక్స్ చేసి నమ్మినట్లుగా చూపించాడు. ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని.. పోరాట సన్నివేశాలను కళ్లు చెదిరే విధంగా తెరకెక్కించాడని.. సాలార్ పార్ట్ 2 కోసం ఈ సినిమాలో చాలా సస్పెన్స్ ఉంచాడని.. చాలా విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉందని వివరించారు. . అవన్నీ పార్ట్ 2లో చూపిస్తామంటూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.