Nagachaitanya : ఎస్, ప్రస్తుతం ఇదే వార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమలో వైరల్గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగ చైతన్యకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా నాగ చైతన్యను హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంత కాలం బాగానే ఉన్న తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
విడాకుల తర్వాత సమంతకు మైయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి సోకింది. ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సమంతకే కాదు అక్కినేని నాగ చైతన్యకు కూడా ఓ జబ్బు ఉందట. కానీ అది అక్కినేని ఫ్యామిలీ బయటపడకుండా దాచి పెట్టిందన్న విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ను ఆడేసుకుంటున్నారు సమంత అభిమానులు .
తనకు మైయోసైటిస్ ఉందని సమంత బహిరంగంగా చెప్పుకొచ్చింది. అక్కినేని ఫ్యామిలీకి అన్ని దాచుకునే అలవాటుందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా నాగ చైతన్య తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది..!!