Kriti Shetty : కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పేరుకు కన్నడ బ్యూటీ అయినా తెలుగులో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతలా అంటే ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో తన ముద్ర వేసింది. ఉప్పెన సినిమాతో ఆమె అభిమానుల మనసుల్లో చెదరని స్థానం దక్కించుకునింది. ఆ తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. చాలా సినిమాలలో నటించింది. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి.. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
![ajith](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/08/ajith-1024x576.webp)
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కృతి శెట్టి. తమిళ్ సినిమాలలో మాత్రం బాగా స్పీడ్ పెంచేసింది. చేతిలో మూడు ప్రాజెక్టులు పట్టుకుని టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. ఇటీవల కృతి శెట్టి ఖాతాలో మరో బిగ్ బంపర్ ఆఫర్ వచ్చి చేరింది. కృతి శెట్టి హీరో అజిత్‌కు సిస్టర్ రోల్లో ఓ సినిమాలో కనిపించబోతుందట. ఇది ఫుల్ టు ఫుల్ చెల్లి సెంటిమెంట్ సినిమాగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
![kriti-shetty](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2022/11/kriti-shetty-1-1024x768.webp)
ఆ కారణంగానే కృతి శెట్టి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. ప్రస్తుతం ఇదే వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరో అజిత్ కి కృతి శెట్టి సిస్టరా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాలు ఎక్కువైపోయాయి. మరీ ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దర్శకులు.