Ranbir Kapoor యానిమల్ సినిమాతో దాదాపు రూ.900కోట్లు కొల్లగొట్టిన హీరో రణ్ బీర్ కపూర్. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సినిమా ఇచ్చిన కిక్కుతో ఫుల్ జోషులో ఉన్నారు. యానిమల్ సినిమా తర్వాత రణ్ బీర్ కపూర్ ఆధ్యాత్మికం వైపు మళ్లారు. త్వరలో రామాయణం అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా మూడు భాగాలుగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/ranbir_12-jpg.webp)
కాగా ఈ సినిమాకు సీత పాత్రలో టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే కోలీవుడ్ సెన్సేషన్ హీరో యష్‌ను సినిమాలో రావణాసురుడి పాత్రకు ఎంచుకున్నారట మేకర్స్. అలా హనుమంతుడిగా సన్నీ డియోల్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్ ని తీసుకున్నారట. ఇక కైక పాత్ర కోసం లారా దత్తాను సంప్రదించినట్లు సమాచారం.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/sethupathi-ranbir-ramayana-1706270692-1-1024x576.webp)
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని ఈ సినిమాలో విభీషణుడి పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు పూర్తిగా మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.