Seerat Kapoor : కొంతమంది హీరోయిన్లు అందంగా ఉన్నప్పటికీ, యాక్టింగ్ టాలెంట్, సూపర్ హిట్స్ ఉన్నప్పటికీ కూడా అవకాశాలు లేక ఇండస్ట్రీ లో రాణింలేకపోతుంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సీరత్ కపూర్. శర్వానంద్ కెరీర్ లో మొట్టమొదటి కమర్షియల్ హిట్ గా చెప్పుకునే ‘రన్ రాజా రన్’ చిత్రం లో ఈమె హీరోయిన్ గా నటించింది. తొలిసినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె, ఆ తర్వాత ‘టైగర్’, ‘కొలంబస్’, ‘రాజు గారి గది 2′,’ఒక్క క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీల’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/image-955.png)
వీటిల్లో అధికశాతం ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలే ఉన్నాయి. కానీ ఎందుకో ఈ హాట్ బ్యూటీ కి అనుకున్న స్థాయిలో పేరు ప్రఖ్యాతలు రాలేదు. ఈమె కంటే తక్కువ అందం, తక్కువ టాలెంట్ ఉన్న ఎంతో మంది హీరోయిన్లు నేడు చేతినిండా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ గా ఉంటే, ఈమె మాత్రం అసలు ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయింది.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/image-956.png)
ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ గా గడుపుతుంది సీరత్ కపూర్. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ తో కలిసి దిగిన కొన్ని రొమాంటిక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/image-953-820x1024.png)
ఇటీవలే వీళ్లిద్దరు కలిసి పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేసారు. అప్పటి నుండి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది అని, ఇద్దరు ప్రేమలో పడ్డారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. న్యూ ఇయర్ రోజు కూడా వీళ్లిద్దరు ప్రైవేట్ పార్టీ లో కలిసి చేసిన రచ్చ మామూలుది కాదంటూ సోషల్ మీడియా లో కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొద్దీ రోజులు ఆగాల్సిందే.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/01/image-954-1024x1024.png)