Anushka : సౌత్ ఇండియా లో ఒక సూపర్ స్టార్ కి సరిసమానమైన క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో అనుష్క పేరు కచ్చితంగా ఉంటుంది. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన ఈమె, ఆ తర్వాత వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ని దక్కించుకుంది.
ఇక ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘అరుంధతి’ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చింది అనుష్క శెట్టి. అప్పట్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు విజయశాంతి ఎలాగో, ఇప్పుడు అనుష్క శెట్టి అలా అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బాహుబలి సిరీస్ తర్వాత ఆమె రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఈ సినిమా షూటింగ్ సమయం లో అనుష్క ప్రభాస్ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇద్దరు ప్రైవేట్ గా కలిసిన సందర్భం లో పలు ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అప్పట్లో వైరల్ అయ్యింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె ఒక స్టార్ క్రికెటర్ తో ప్రేమాయణం నడుపుతుందని తెలుస్తుంది.
గత కొంతకాలం గా డేటింగ్ చేస్తూ వస్తున్న వీళ్ళు, ఈ ఏడాది మూడు ముళ్ల బంధం తో ఒక్కటి కాబోతున్నారని. ఫిబ్రవరి నెలలో నిశ్చితార్థం కూడా జరగొచ్చని సోషల్ మీడియా లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజం అనేది చూడాలి. ఇంతకీ ఆ స్టార్ క్రికెటర్ ఎవరు ఏమిటి అనే విషయాన్ని బయటకి రానివ్వలేదు కానీ, ముంబై లో వీళ్లిద్దరు కలిసి ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్నారట.